న్యూజిలాండ్ కిరాతకుడి ఉన్మాదం : 50 మంది చంపి.. కోర్టులో నవ్వుతున్నాడు

  • Published By: madhu ,Published On : March 16, 2019 / 06:02 AM IST
న్యూజిలాండ్ కిరాతకుడి ఉన్మాదం : 50 మంది చంపి.. కోర్టులో నవ్వుతున్నాడు

Updated On : March 16, 2019 / 6:02 AM IST

న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్ ప్రాంతంలోని ఆలన్ నూర్, లిన్ వుడ్ మసీదుల్లో మారణ హోమం సృష్టించిన దుండగుడు బ్రెంటన్ టారంట్ కోర్టులో ప్రవేశ పెట్టారు పోలీసులు. నిందితుడు బెయిల్ ఇవ్వాలని కోరలేదు. దీనితో కోర్టు విచారణ నిమిత్తం ఏప్రిల్ 5 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఇతడిని కఠినంగా శిక్షించాలంటూ కోర్టు ముందు బాధిత కుటుంబాలు నినాదాలు చేశాయి.

ఇదే సమయంలో పశ్చాత్తాపం పడకుండా నిందితుడు కోర్టు ముందు నవ్వుతూ ఉండడం బాధిత కుటుంబాలను ఆగ్రహనాకి గురి చేసింది. 50మందిని చంపి కోర్టులో నవ్వడంతో అతనిని బహిరంగంగా చంపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు మసీదుల్లో మారణహోమానికి గాను అతడిపై పోలీసులు హత్యారోపణల కింద కేసు నమోదు చేశారు. 
Read Also :ఇండియన్స్ మిస్సింగ్ : నా కొడుకు ఎక్కడ? హైదరాబాదీ తండ్రి ఆవేదన

మార్చి 15వ తేదీ శుక్రవారం ఆల్ నూర్, లిన్ వుడ్ మసీదుల్లో టారంట్ విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 49మంది మృతి చెందారు. దాదాపు ఎంతో మందికి గాయాలయ్యాయి. చనిపోయిన వారిలో విదేశాలకు చెందిన వారు ఉన్నారు. ఆ సమయంలో బంగ్లాదేశ్ క్రికెటర్లు కూడా ఉన్నారు. వీరంతా సేఫ్‌గా బయటపడ్డారు. ఈ దాడుల్లో హైదరాబాద్‌కి చెందిన ఆరుగురికి గాయాలయ్యాయి. కోర్టు ఎదుట ప్రవేశ పెట్టే ముందు నిందితుడికి ఖైదీ దుస్తులు వేయించి, చేతులకు బేడీలు  వేశారు. పటిష్ట భద్రత మధ్య కోర్టుకు అతనిని తీసుకొచ్చారు.