7 దేశాల్లోని 276 మంది భారతీయులకు కరోనా..ఇరాన్ లో అత్యధికంగా 255 మందికి
విదేశాల్లోని భారతీయులు కరోనా వైరస్ బారినపడ్డారు. 7 దేశాల్లోని 276 మంది భారతీయులకు వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

విదేశాల్లోని భారతీయులు కరోనా వైరస్ బారినపడ్డారు. 7 దేశాల్లోని 276 మంది భారతీయులకు వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.
విదేశాల్లోని భారతీయులు కరోనా వైరస్ బారినపడ్డారు. 7 దేశాల్లోని 276 మంది భారతీయులకు వైరస్ సోకినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఇరాన్ లో అత్యధికంగా 255 మంది భారతీయులకు కరోనా వైరస్ సోకింది. వారంతా లద్దాక్ నుంచి ఇరాన్ పర్యటనకు వెళ్లి చిక్కుకుపోయారు. వారి కోసం ఆరుగురు వైద్యులను కేంద్ర ఇరాన్ కు పంపింది. హాంకాంగ్, కువైట్, రువాండా, శ్రీలంకలో ఒక్కొక్కరికి చొప్పున కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఇటలీలో ఐదుగురు ఎన్ ఆర్ఐ లకు కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇరాన్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. మహమ్మారి కారణంగా ఇరాన్ లో కొత్త 113 మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 724 కు చేరింది.
ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ వివిధ దేశాల్లో ఉంటున్న భారతీయులకు కూడా సోకింది. జమ్మూకశ్మీర్ లోని లద్దాక్ ప్రాంతం నుంచి పర్యాటక ప్రాంతాలను చూసేందుకు వీరంతా ఇరాన్ వెళ్లారు. అక్కడ అత్యధికులకు వైరస్ సోకింది. ప్రస్తుతం వీరంతా ఇరాన్ లోనే చిక్కుకున్న పరిస్థితి నెలకొంది. యూఏఈలో కూడా 12 భారతీయులకు వైరస్ సోకింది. ఇటలీలో మరో ఐదుగురికి వైరస్ సోకింది. హాంకాంగ్, కువైట్, రువాండా, శ్రీలంకలో ఒక్కొక్క కేసు నమోదు అయింది.
విదేశాల్లో ఉన్న మొత్తం 276 మంది భారతీయులకు వైరస్ సోకింది. చైనా తర్వాత అత్యధికంగా ఇటలీ, ఇరాన్, స్పెయిన్ వంటి దేశాల్లో ఈ వైరస్ విజృంభిస్తోంది. అక్కడి నుంచి ట్రావెల్ అడ్వైజరీ విడుదల చేసిన విదేశాంగా శాఖ.. చైనా, ఇరాన్, ఇటలీ, ఇండోనేషియా, ఆఘ్గనిస్తాన్, పిలిప్పీన్స్ వంటి దేశాల నుంచి భారత్ కు రాకపోకలు నిషేధిస్తూ ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ప్రత్యే విమానాలు పంపించి విదేశాల్లో చిక్కుకున్న భారతీయులకు వైద్య పరీక్షలు నిర్వహించి తర్వాతే వారిని భారత్ కు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.
ఇప్పటికే ఇరాన్ కూడా ఏడుగురు వైద్యులను పంపించారు. అక్కడున్న ఎంబసీని ఆశ్రయించినట్లైతే ఏ ఏ దేశాల్లో భారతీయులు చిక్కుకుని కరోనా వైరస్ బారిన పడ్డట్లు ఉన్నవారికి కానీ లేక అనుమానిత లక్షణాలు ఉన్న వారు ఎంబసీని ఆశ్రయించినట్లైతే అక్కడ వీరికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత భారత్ కు రావాలనుకుంటే ఎయిరిండియా ద్వారా కానీ లేదా ఇతర విమానా సంస్థల ద్వారా ప్రత్యేకంగా ఇప్పటికే దాదాపు 2 వేల మందిని వివిధ దేశాల నుంచి భారతదేశానికి కేంద్రం తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతుందని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ప్రకటించారు. కాసేపటి క్రితం ఇండోనేషియా నుంచి అక్కడ చిక్కుకున్న భారత విద్యార్థులు ఎయిర్ ఏషియా విమానంలో ఢిల్లీ, వైజాగ్ కు బయలుదేరారు.
విదేశాల్లో కూడా భారతీయులకు కరోనా ఎఫెక్ట్ తగిలింది. ఎందుకంటే చైనా నుంచి వివిధ దేశాల్లో ట్రావెల్ చేస్తూ ఈ వైరస్ ను తీసుకెళ్లడం ద్వారా భారతీయులకు కూడా వైరస్ వ్యాప్తి చెందింది. విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. ఉద్యోగ రీత్య, చదువుల రీత్యా వెళ్లిన వారికి వైరస్ సోకుతుంది. భారత్ లో వైరస్ ప్రభావం కొంత తక్కువగా ఉంది. భారత ప్రభుత్వ చర్యలు కూడా యుద్ధప్రాతిపదికగా తీసుకుంటుంది. డబ్ల్యుహెచ్ సైతం భారత ప్రభుత్వ చర్యలను అభినందించింది. భారత్ లో ఉంటే సురక్షితంగా ఉంటారన్న కోణంలో వివిధ దేశాల్లో ఉన్న భారతీయులు స్వదేశానికి వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఎయిర్ పోర్టులో స్టక్ అవుతున్నారు. ఆ అంశాలను కూడా పరిశీలిస్తూ భారత విదేశాంగ శాఖ వారిని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చి వారికి క్వారెంటైన్ చేసి కరోనా వైరస్ సోకపోయినట్లైతే వారిని స్వస్థలాలకు పంపే ప్రయత్నం చేస్తోంది.
భారత దేశంలో ఇప్పటి వరకు ఉన్న అధికారిక లెక్కల ప్రకారం 147 మందికి వైరస్ సోకింది. వీరిలో ముగ్గురు చనిపోయారు. 14 మందిని డిశ్చార్జ్ చేశారు. 147 మందిలో కూడా 27 మంది విదేశీయులు ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి . అక్కడ కూడా యుద్ధ ప్రాదిపదికన చర్యలు చేపట్టారు. భారత్ లో, ఇతర దేశాల్లో భారతీయులు వైరస్ ఇబ్బంది పడుతూ అక్కడ నిలిచి భారత ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్రం కూడా ఎప్పటికప్పుడు ప్రపంచ దేశాల్లోని భారతీయులు పడుతున్న అంశాన్ని మానిటర్ చేస్తూ వారిని స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు.