కరెన్సీ నోట్లు, టచ్ ఫోన్లపైనా 28రోజుల పాటు సజీవంగా కరోనావైరస్: స్టడీ

Coronavirus కరెన్సీ నోట్లు, టచ్ ఫోన్లపై 28రోజుల పాటు సజీవంగా ఉంటుంది. చల్లగానూ చీకటిగా ఉండే ప్రదేశాల్లో ఈ పరిస్థితులు ఉంటాయని ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ వెల్లడించింది CSIROకు చెందిన రీసెర్చర్లు SARS-CoV-2వైరస్ అనేది చీకటి ప్రదేశాల్లో మూడు టెంపరేచర్ల వద్ద పరీక్షించారు.
వాతావరణం వేడెక్కేకొలదీ అవి సజీవంగా ఉండే లక్షణాలు కోల్పోతూ వచ్చాయి. 20డిగ్రీల సెల్సియస్ (68 డిగ్రీల ఫారెన్ హీట్)వద్ద SARS-CoV-2అనేది నున్నటి తలాల మీద చాలా దృఢంగా ఉంటుంది. అంటే మొబైల్ ఫోన్ స్క్రీన్స్ మీద గ్లాసుల మీద, స్టీల్, ప్లాస్టిక్ బ్యాంక్ నోట్ల మీద సజీవంగా ఉంటుంది.
30డిగ్రీల సెల్సియస్ (86 డిగ్రీల ఫారెన్‌హీట్)వద్ద వైరస్ మనుగడ ఏడు రోజుల వరకూ ఉంటుంది. అదే 40డిగ్రీల సెల్సియస్ వద్ద (104 డిగ్రీల ఫారెన్‌హీట్) టెంపరేచర్ లో 24గంటలు మాత్రమే బతకగల్గుతుంది.
మెత్తటి తలాలైన దూది లాంటి వాటిపై తక్కువ ఉష్ణోగ్రతల వద్ద 14రోజులు, అధిక ఉష్ణోగ్రతల వద్ద 16గంటలు సజీవంగా ఉంటుందని రీసెర్చర్లు అంటున్నారు. గత స్టడీల్లో మెత్తటి తలాలపై వైరస్ 4రోజులు మాత్రమే సజీవంగా ఉంటుందని చెప్పారు.
ఆస్ట్రేలియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రిపేర్డ్‌నెస్ డైరక్టర్ ట్రెవర్ డ్రూ పలు మెటేరియల్స్ ను టెస్టింగ్ చేసి వాటి జీవిత కాలాన్ని పరీక్షించారు. అంటే దానికి అర్థం వైరస్ ఉంటుందనే కానీ ఇతరులకు హాని చేసేంత కెపాసిటీతో ఉంటుందని కాదు’ అని పబ్లిక్ బ్రాడ్‌కాస్టర్ ఏబీసీతో అన్నారు.
కానీ, అటువంటి తలాలపై తాకి కళ్లు, ముక్కు, నోటి దగ్గర పెట్టకుంటే వైరస్ వచ్చే అవకాశాలు లేకపోలేదు. అయితే వాటిని తాకిన తర్వాత ఓ రెండు వారాల తర్వాత కానీ, మనలో లక్షణాలనేవి కనిపించవు.
తలాలపై వ్యాప్తి అనేది ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది. ఎంతకాలం వైరస్ అనేది సజీవంగా ఉంటుందో.. రిస్క్ డెవలపింగ్ కు హై కాంటాక్ట్ ఏరియాల్లో మాత్రమే ఇది సాధ్యపడుతుందని సీఎస్ఐఆర్ఓకు చెందిన డెబ్బీ ఈగల్స్ చెప్పారు.
ఇన్ఫెక్షన్ ఉన్న వారికి దూరంగా ఉంటే వైరస్ వ్యాప్తి దూరంగానే ఉంటుంది. అలా కాకుంటే.. కొన్ని సార్లు దేశంలో ఇది ఫ్రీగా వ్యాప్తి జరుగుతూ వస్తుందని ఆయన అంటున్నారు.