Lockdown ప్రాంతాలకు విమానంలో పిజ్జా, బీరు డెలివరీ

Lockdown ప్రాంతాలకు విమానంలో పిజ్జా, బీరు డెలివరీ

Updated On : April 3, 2020 / 2:30 PM IST

బీరు, పిజ్జా విమానంలో డెలివరీ చేయడం ఎప్పుడూ విని ఉండం. కానీ, ఇది జరుగుతుంది. ఆస్ట్రేలియాలో లాక్ డౌన్ కారాణంగా చాలా ప్రాంతాలు పనిచేయకుండా పోయాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం పని చేస్తుండటం విశేషం. లాక్ డౌన్ ఉన్న ప్రాంతాల్లో గ్యారీ ఫ్రాస్ట్ అనే ఫైలట్ తన సొంత రెస్టారెంట్ లోని ఫుడ్ ను 315కిలోమీటర్ల దూరం ప్రయాణించి కేథరీన్ ప్రాంతానికి డెలివరీ ఇస్తున్నాడు. 

చాలా ప్రాంతాల నుంచి ఆర్డర్లు మాత్రమే వస్తున్నాయి కానీ, ఎవరూ వచ్చి తినడం లేదు, తీసుకెళ్లడం లేదు. అందుకే అతను రెడీ చేసే పిజ్జాతో పాటు వారికి కావాలసిన ఇతర ఆహారపదార్థాలను విమానంలో వెళ్లి డెలివరీ చేస్తున్నాడు. ‘ఎవ్వరూ ఎక్కడికి వెళ్లడానికి వీల్లేదు. వస్తువులు కూడా చాలా తక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంటున్నాయి. మేం డన్మారా రోడ్ హౌజ్ ప్రాంతంలో పిజ్జాలు తయారుచేస్తాం. వారందరికీ కావాలంటే ఒకేసారి విమానంలో అన్నింటినీ డెలివరీ చేస్తున్నాను’

‘ఫ్రాస్ట్ డెలివరీ ఐడియా అందరికీ నచ్చింది. ముందుగా 100కిలోమీటర్ల దూరం వరకూ బీరు, ఫుడ్ సప్లై చేసేవాడు. ఇప్పుడు 400కిలోమీటర్ల దూరంలో ఉన్నవారు కూడా అడుగుతుండటంతో వారానికి ఒకసారి లాంగ్ ట్రిప్ కూడా వేస్తున్నాడు. 

మాకు కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. దీని గురించి విని చాలా మంది ఎగ్జైటింగ్ గా ఫీలవుతున్నారు. దీనిని మేం కమర్షియల్ గా ఆలోచించడం లేదు. ప్రజల్లో ఫ్రెండ్లీ వాతావరణం తీసుకురావాలని చక్కటి మైండ్ సెట్ తయారుచేయాలనే ఇలా చేస్తున్నట్లు రెస్టారెంట్ ఓనర్.. గ్యారీ ఫ్రాస్ట్ అంటున్నాడు. ఎవరైనా మెయిల్ చేసి ఆర్డర్ ఇస్తే చాలు బీరు, పిజ్జా తీసుకుని విమానంలో బయల్దేరిపోతాడు గ్యారీ. 

Also Read | Tablighi Jamaat: స్పాన్సర్లపైనా.. వర్కర్లపైనా కేసులు, వీసాలు బ్లాక్ చేసిన ప్రభుత్వం