అమెరికాలో అల్లకల్లోలం.. కరోనా మృతదేహాలు పూడ్చేందుకు స్థలం కొరత
చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. 205 దేశాలకు కరోనా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 11లక్షలకు చేరువలో కరోనా

చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. 205 దేశాలకు కరోనా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 11లక్షలకు చేరువలో కరోనా
చైనాలో వెలుగుచూసిన కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. 205 దేశాలకు కరోనా వ్యాపించింది. ప్రపంచవ్యాప్తంగా 11లక్షలకు చేరువలో కరోనా బాధితుల సంఖ్య ఉంది. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 59వేల 140మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా నిన్న(ఏప్రిల్ 3,2020) ఒక్కరోజే 82వేల కొత్త కేసులు, 6వేల మరణాలు నమోదయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 2.28 లక్షలు.
ప్రపంచ దేశాల సంగతి ఏమో కానీ, అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా దెబ్బకు అమెరికా అల్లకల్లోంగా మరింది. రోజురోజుకి అమెరికాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య రాకెట్ వేగంతో పెరుగుతున్నాయి. అమెరికాలో పరిణామాలు స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.
2.77లక్షల కరోనా కేసులు, 7వేల మరణాలు:
సుమారు 2 నెలలు కన్నా ముందే అమెరికాలో తొలి కరోనావైరస్ కేసు నమోదైంది. అప్పటి నుంచి దేశమంతా అది విస్తరిస్తూ వచ్చింది. ఇప్పటికే సుమారు 2.77 లక్షల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సుమారు 7 వేలకు పైగా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అమెరికా ప్రపంచంలో కరోనావైరస్‌కు కేంద్ర బిందువుగా మారింది. మొదట వైరస్ బయట పడ్డ చైనాలో పరిస్థితి ఇప్పుడిప్పుడే అదుపులోకి వస్తోంది. అటు యూరప్‌లో ఇటలీ, స్పెయిన్ దేశాలు అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. రానున్న రెండు వారాలు అమెరికాలో పరిస్థితులు దారుణంగా ఉండబోతున్నాయని సాక్షాత్తూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు వైద్యులు కూడా హెచ్చరిస్తున్నారు.
న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూయార్క్ లలో పరిస్థితి దారుణం.. ఖననానికి స్థలాల కొరత:
అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 2.76లక్షలు దాటింది. అమెరికాలో నిన్న(ఏప్రిల్ 3,2020) ఒక్కరోజే 32వేలకు పైగా కొత్త కేసులు, 1,320మరణాలు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది. న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూయార్క్ లలో పరిస్థితి దారుణంగా ఉంది. ఆ మూడు రాష్ట్రాల్లో చైనాను మించిన కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ మూడు రాష్ట్రాల్లో లక్షా 20వేల కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్క న్యూయార్క్ లోనే దాదాపు లక్ష కరోనా కేసులు నమోదవగా, 3వేల మరణాలు సంభవించాయి. న్యూయార్క్ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, మృతుల ఖననానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. స్థలాల కొరత ఏర్పడింది. ఇక అమెరికాలో కరోనా దెబ్బకు 2 వారాల్లో కోటి మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు. అమెరికాతో పాటు ఇటలీ, స్పెయిన్, బ్రిటన్ లోనూ కరోనా మరణాలు పెరిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అమెరికాలో 7వేల 391 మంది చనిపోతే, ఇటలీలో 14వేల 681 మంది, స్పెయిన్ లో 11వేల 198 మంది మరణించారు. న్యూయార్క్ లో వైద్య రంగం సంక్షోభంలో చిక్కుకుంది. నిత్యావసరాల కొరత ఏర్పడింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముందే మేల్కోని అమెరికా:
మాస్కులు, గ్లౌజులు, గౌన్లు, వెంటిలేటర్లు. కరోనావైరస్ అనగానే చికిత్స చెయ్యాలంటే ఉండాల్సిన కనీస వస్తువులు ఇవి. అమెరికాలో వైద్యులకు, ఆస్పత్రులకు కొదవేం లేదు. కానీ ఈ వైరస్‌కు కేంద్ర బిందువుగా మారిన ప్రాంతాల్లో మాత్రం చికిత్సకు అవసరమయ్యే కనీసం అవసరాలు అటు రోగులకు, ఇటు వైద్యులకు కరవయ్యాయి. ముందుగా మేల్కోవడంలో అమెరికా పూర్తిగా విఫలమైందని నిపుణులు అంటున్నారు. దక్షిణ కొరియా, సింగపూర్‌లాంటి దేశాలు ముందుగానే సమస్య తీవ్రతను గుర్తించి పరీక్షలు ముమ్మరంగా నిర్వహించడంతో పరిస్థితి దిగజారకుండా జాగ్రత్త పడ్డాయి. అలా చెయ్యడంలో అమెరికా పూర్తిగా విఫలమైందని, దాంతో ఒక్కసారిగా సమస్య తీవ్రంగా మారిందని వివరిస్తున్నారు.
* ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయ తాండవం
* 205 దేశాలకు వ్యాపించిన కరోనా వైరస్
* ప్రపంచవ్యాప్తంగా 11లక్షలకు చేరువలో కరోనా బాధితుల సంఖ్య
* ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ఇప్పటివరకు 59వేల 140మంది మృతి
* ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 10లక్షల 98వేలకుపైగా కేసులు
* ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్కరోజే 82వేల కొత్త కేసులు, 6వేల మరణాలు
* ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 2.28 లక్షల మంది
* అమెరికాలో విజృంభిస్తున్న కరోనా వైరస్, 2.76లక్షలు దాటిన కరోనా కేసులు
* అమెరికాలో నిన్న(ఏప్రిల్ 3,2020) ఒక్కరోజే 32వేలకు పైగా కొత్త కేసులు నమోదు
* అమెరికాలో నిన్న(ఏప్రిల్ 3,2020) ఒక్కరోజే 1,320మంది మృతి
* అమెరికాలో ఏడున్నర వేలకు చేరిన మరణాలు, ఇప్పటివరకు 7వేల 391మంది మృతి
* అమెరికా, స్పెయిన్, బ్రిటన్ లో పెరిగిపోతున్న కరోనా మరణాలు
* న్యూయార్క్ లో కరోనా మృతుల ఖననానికి ఇబ్బందులు, స్థలాల కొరత
* ఒక్క న్యూయార్క్ లోనే దాదాపు లక్ష కేసులు, 3వేల మరణాలు
* న్యూజెర్సీ, కనెక్టికట్, న్యూయార్క్ లలో చైనాను మించిన కేసులు
* ఈ మూడు రాష్ట్రాల్లో లక్షా 20వేల కరోనా కేసులు
* అమెరికాలో 2 వారాల్లో ఉద్యోగాలు పోగొట్టుకున్న కోటి మంది
* అమెరికాలో 7వేల 391 మంది, ఇటలీలో 14వేల 681 మంది, స్పెయిన్ లో 11వేల 198 మంది మరణం
* ఫ్రాన్స్ లో 6వేల 507, చైనాలో 3వేల 322, ఇరాన్ లో 3వేల 294, యూకేలో 3వేల 605, నెదర్లాండ్స్ లో 1,487, జర్మనీలో 1,275, బెల్జియంలో 1,143, స్విట్జర్లాండ్ లో 591 కరోనా మరణాలు
* న్యూయార్క్ లో వైద్య రంగం సంక్షోభం, నిత్యావసరాల కొరత
* ఇటలీ, స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇరాన్, యూకేలో వేలల్లో కేసులు
* అమెరికా తర్వాత ఇటలీలోనే అత్యధికంగా కరోనా మరణాలు
* ఇటలీలో లక్షా 20వేలు, స్పెయిన్ లో లక్షా 19వేలు, జర్మనీలో 91వేలు, ఫ్రాన్స్ లో 64వేలు, ఇరాన్ లో 53వేల కరోనా కేసులు
* టర్కీ, బెల్జియం, స్విట్జర్లాండ్, కెనడాల్లోనూ వేలల్లో కేసులు
* భారత్ గత ఆరు రోజుల్లో మూడు రెట్లు పెరిగిన కరోనా కేసులు
* దేశంలో ఇప్పటివరకు 3వేల 108 కేసులు
* శుక్రవారం(ఏప్రిల్ 3,2020) ఒక్కరోజే 508 కొత్త కేసులు, 12 మరణాలు
* ఇప్పటివరకు 90మంది కరోనాతో మృతి
* కరోనా నుంచి కోలుకున్న 229 మంది
* మహారాష్ట్రలో అత్యధికంగా 490 కేసులు
* తమిళనాడులో 411 మందికి వైరస్
* రెండు రోజులుగా దేశంలో నమోదైన కొవిడ్ పేషెంట్లలో 647మంది ఢిల్లీ మర్కజ్ సమావేశాలకు హాజరైన వాళ్లే..
Also Read | ఫీజులు వసూలు చేయొద్దు.. అన్ని ప్రైవేట్ స్కూళ్లకు ప్రభుత్వం ఆదేశాలు