వైరస్‌లు పుట్టేదెక్కడ.. ఒకరి నుంచి మరొకరికి వచ్చే విధానమేంటి?

వైరస్‌లు పుట్టేదెక్కడ.. ఒకరి నుంచి మరొకరికి వచ్చే విధానమేంటి?

Updated On : June 21, 2021 / 3:08 PM IST

కొవిడ్-19 గబ్బిలాల్లో, పెంగ్విలిన్ లలో, ఇతర అడవి జంతువుల్లోకి వ్యాప్తి చెందడానికి లింక్ ఏమైనా ఉందా.. జెనెటిక్ గా వ్యాప్తి చెందే జబ్బుల్లో సంబంధముందా.. తెలుసుకుందాం. ప్రపంచానికి పరిచయమైన COVID-19ఒక్కొక్కటిగా దేశాలన్నింటినీ చుట్టుముట్టింది. చైనాలోని ల్యాబొరేటరీల్లో తయారై వివిధ దేశాల జనాభాను పొట్టనబెట్టుకుంది. నేచర్ మెడిసిన్ జర్నల్  SARS-CoV-2 గురించి ఇలా చెప్తుంది.

SARS-CoV-2 అనే వైరస్ కచ్చితంగా ల్యాబొరేటరీల్లో తయారుచేసింది కాదు. ఇది ముమ్మాటికి జంతువుల నుంచి సోకిందే. ఇది మనుషుల నుంచి వ్యాప్తి చెందే జన్యు నిర్మితంగా ఉంది. త్వరగా వ్యాప్తి చెందే స్పైక్ ప్రొటీన్ ఉండటంతో జంతువుల నుంచి మనుషులకు త్వరగా సంక్రమిస్తుంది.

మొదటి సారిగా COVID-19 చైనాలోని హువానన్, వూహాన్ మార్కెట్లోనే కనిపించింది. అక్కడే ఏదో జంతువుల నుంచి వైరస్ పుట్టినట్లు సమాచారం. ఈ అంశంలో గబ్బిలాలు, పెంగ్వోలిన్లే వైరస్ త్వరగా వ్యాప్తి చేస్తాయని నిపుణులు అంటున్నారు. SARS-CoV-2కు SARS-CoV మధ్య చాలానే పోలికలు ఉన్నాయి. ఇందులో గబ్బిలాలు రిజర్వాయర్ వలె పనిచేస్తాయి. మలయాన్ పెంగ్వోలిన్లు అక్రమంగా దీనిని వ్యాప్తి చేస్తాయి.

SARS-CoV లాంటి కరోనా వైరస్‌లు సహజంగానే  పెంగ్వోలిన్ల నుంచి ఇతర జంతువులకు సోకడానికి ఒకే రకమైన ఆర్బీడీ ఉండటమే కారణం. ఇది ప్రధానంగా ఇతర వైరస్ ల కాంబినేషన్ కావడంతో సంక్లిష్టంగా మారింది. జంతువుల నుంచి మనుషులకు వైరస్ వ్యాప్తి చెందే లక్షణాలు ఉన్నాయి కాబట్టే వ్యాప్తి చెందింది కానీ, మనిషి నుంచి మనిషికి ఇతర మార్గాల ద్వారా సంక్రమిస్తుంది.

కరోనా వైరస్ లలోని రకాలన్నీ జన్యుపరంగా సంక్రమించేవే. వీటన్నిటి మూలం కూడా ఒకేలా కనిపిస్తుంది. ఈ వ్యాధికారక క్రిములు జబ్బులను సృష్టించడం కొత్తదేం కాదు. యునైటెడ్ నేషన్స్ ఇన్విరాన్మెంట్ ప్రోగ్రాంను బట్టి 60శాతం ఇన్ఫెక్షన్లు జంతువుల నుంచి వచ్చేవే. 75శాతం సహజంగా పరిసరాల ద్వారా వ్యాప్తి చెందుతాయి. వ్యాధికారకాల్లో దాదాపు అన్నీ వైరస్ లే. బ్యాక్టీరియా, పారాసైట్స్, ఫంగీలు లాంటివన్నీ.

జంతువుల నుంచి జబ్బులు ఎందుకొస్తాయంటే:
మనుషులకు, అటవీ జంతువుల మధ్య సంబంధాలెక్కువే. ఆటవిక జీవితం నుంచి మనుషులకు ఇన్ఫెక్షన్లు త్వరగానే సోకుతాయి. ఎబోలా, బర్డ్ ఫ్లూ, మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, రిఫ్ట్ వ్యాలీ ఫీవర్, సార్స్, వెస్ట్ నీలె వైరస్, జికా వైరస్, కొవిడ్ 19వంటివన్నీ ఇదే కోవకు చెందినవి.

జంతువుల ద్వారా సంక్రమించే జబ్బుల్లో మానవ కార్యకలాపాల ద్వారా ముడిపడ్డవే ఎక్కువ ఉంటాయి. వాటి శరీర భాగాలకు అనుగుణంగా కొన్ని వందల్లో క్రిములు, వైరస్ లు శరీరానికి అతుక్కుని ఉంటాయి. వాటితో సాన్నిహిత్యంగా ఉండడం ద్వారా అవి మనుషులకు సోకే ప్రమాదముంది. ఎబోలా, నిఫా వైరస్, జికా వైరస్ లు ఉదహరణగా చెప్పొచ్చు.

వన్ హెల్త్:
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాలసీ ప్రకారం.. వన్ హెల్త్ అనేది ఒక్కటే నినాదం. పలు రకాల సెక్టార్లు కలిసి ప్రజారోగ్యం కోసం పాటుపడతాయి. ఫుడ్ సేఫ్టీ, జంతువుల నుంచి వచ్చే వ్యాధుల నియంత్రణ, వ్యాధినిరోధక శక్తి పెంచడం వంటి అంశాల గురించి ముందుగానే హెచ్చరిస్తుంది. వాతావరణ శాస్త్రవేత్తలు కూడా వన్ హెల్త్ నియమం జంతువుల నుంచి వచ్చే జబ్బులను అడ్డుకుంటుంది.