Easyjet Flight : విమానం బాత్‌రూంలో ఓ జంట పాడుపని.. సిబ్బంది బలవంతంగా డోర్ తీసిచూడగా..
విమానం ఇబిజాలో ల్యాండ్ అయిన అనంతరం ఆ జంటను పోలీసులకు అప్పగించినట్లు ఈజీ జెట్ సంస్థ తెలిపింది.

Easyjet Flight
Couple In Flight Toilet: ఇటీవలి కాలంలో విమానాల్లో కొందరు ప్రయాణికులు విచిత్ర ప్రవర్తనతో తోటి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒకరు మద్యం మత్తులో మూత్ర విసర్జన చేసిన ఘటన వెలుగులోకి రాగా, మరొకరు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా, ఈజీ జెట్ సంస్థకు చెందిన విమానంలో ఓ జంట పాడుపనికి పాల్పడింది. బాత్ రూంలోకి వెళ్లి తమ కార్యకలాపాల్లో మునిగిపోయారు. విమాన సిబ్బంది బలవంతంగా డోర్ తీసిచూడగా ఆ జంట చేస్తున్న పనినిచూసి సిబ్బందితోపాటు, ప్రయాణికులు కంగుతిన్నారు.
ఈనెల 8న ఈజీజెట్ సంస్థకు చెందిన విమానం యూకేలోని లూటన్ నుంచి ఇబిజాకు బయలుదేరింది. గాలిలో ప్రయాణిస్తున్న క్రమంలో ఇద్దరు ప్రయాణికులు బాత్ రూంలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. లోపలి నుంచి శబ్దాలు రావడంతో విమాన సిబ్బంది డోర్‌ను తెరవాలని సూచించారు. కానీ ఆ జంట డోర్‌ను తెరవక పోవడంతో సిబ్బంది బలవంతంగా డోర్ తెరిచే ప్రయత్నం చేశారు. డోర్ తెచుకోవడంతో ఆ జంట టాయిలెట్‌లో చేస్తున్న పనిని చూసి విమాన సిబ్బందితోసహా తోటి ప్రయాణీకులు కంగుతిన్నారు.
viral video : కాసేపు ఆగలేకపోతున్నావా .. పెళ్లి పీటలపైనే వరుడు చెంపఛెళ్లుమనిపించిన వధువు
ఇందుకు సంబంధించిన ఘటనను విమానంలోని కొందరు ప్రయాణికులు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో బాత్ రూంలో ఉన్న జంట అసభ్యకర రీతిలో ఉండటంతో నెటిజన్లు విమానంలో ఇదేం పాడుపని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విమానం ఇబిజాలో ల్యాండ్ అయిన అనంతరం ఆ జంటను పోలీసులకు అప్పగించినట్లు ఈజీ జెట్ సంస్థ తెలిపింది.