కరోనా ఖతమైపోయిందని అన్నీ తెరిచేశారు..భారత్‌లో నేటి పరిస్థితికి అదే కారణం
భారత్‌లో కరోనా ఇంతగా వ్యాపించిపోవటానికి..ఇన్ని మరణాలు సంభవించటంపై అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐఏఐడీ) డైరెక్టర్, అధ్యక్షుడు బైడెన్ ముఖ్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కరోనా పరిస్థితిని తక్కువగా అంచనావేయటం..ప్రభుత్వాలు తప్పుడు లెక్కలు, కరోనా ఖతం అయిపోయిందని ముందుగానే అన్ని వ్యవస్థలనూ తెరిచేశారని అదే ఇన్ని మరణాలకు..ఇంత ప్రమాకర స్థితికి కారణమని డాక్టర్ ఫౌచీ పేర్కొన్నారు.

Covid 19 Crisis In India
Covid -19 Crisis In India : భారత్‌లో కరోనా ఇంతగా వ్యాపించిపోవటానికి..ఇన్ని మరణాలు సంభవించటంపై అమెరికా జాతీయ అలర్జీ, అంటువ్యాధుల సంస్థ (ఎన్ఐఏఐడీ) డైరెక్టర్, అధ్యక్షుడు బైడెన్ ముఖ్య సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో కరోనా మరణాలు చాలా బాధకలిగిస్తున్నాయనీ..దీనికి కారణం కరోనా పరిస్థితిని తక్కువగా అంచనావేయటం..ప్రభుత్వాలు తప్పుడు లెక్కలు, కరోనా ఖతం అయిపోయిందని ముందుగానే అన్ని వ్యవస్థలనూ తెరిచేశారని అదే ఇన్ని మరణాలకు..ఇంత ప్రమాకర స్థితికి కారణమని డాక్టర్ ఫౌచీ పేర్కొన్నారు.
తప్పుడు లెక్కలు..సరైన అంచానాలు వేయలేకపోవటమే భారత్ కొంపముంచాయని ఆయన అన్నారు. . కరోనా ఖతమైపోయిందని భావించి వ్యవస్థలను యథేచ్ఛగా తెరిచేశారని..దీంతో ప్రజలు వారి దైనందిన జీవితాల్లో పడిపోయారని..కరోనాను తక్కువగా అంచనా వేయటం చాలా ప్రమాదాన్ని తెచ్చిపెట్టిందని అన్నారు.
భారత్‌లోని ప్రస్తుత పరిస్థితులు ఎన్నో అనుభవాలను నేర్పిస్తున్నాయని..ముఖ్యంగా పరిస్థితిని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయకూడదని భారత్ పరిస్థితిని చూసి తెలుసుకోవచ్చని..భారత్ కు వచ్చిన ఈ అనుభవం అదే చెబుతోందని సెనేట్‌లోని సంబంధిత కమిటీకి చెప్పారు. ప్రజారోగ్యం పరంగా అవసరమైన సన్నద్ధత గురించి ఈ అనుభవం ద్వారా మనం తెలుసుకోవచ్చని అన్నారు. ప్రపంచంలో ఏమూల ఇలాంటి వైరస్ ఉన్నా అది అమెరికాకూ ముప్పు తెస్తుందని ఫౌచీ అన్నారు.