ట్రంప్‌కి మరోసారి కరోనా టెస్ట్‌లు.. వైట్ హౌస్ ప్రకటన

అగ్రరాజ్యం అమెరికా కరోనా దెబ్బకు వణికిపోతోంది. ఇప్పటికే ఆ దేశంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసులు అక్కడి ప్రభుత్వాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే కరోనా వైరస్.. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌస్‌ను తాకింది. వైట్‌హౌస్‌లో విధులు నిర్వహించే ఓ అధికారికి కరోనా సోకడంతో ఇప్పుడు అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
అమెరికా ఉపాధ్యక్షుడు మికీ పెన్సీ బృందంలో పనిచేస్తున్న ఓ అధికారికి కరోనా వైరస్ సోకడంతో అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. దీంతో అప్పుడు డొనాల్డ్ ట్రంప్‌కు సైతం కరోనా టెస్ట్‌లు నిర్వహించారు.. అయితే ఆయనకు కరోనా నెగిటివ్ వచ్చింది. కానీ ఇప్పుడు మరోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మరోసారి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు సీన్ పి కాన్‌లీ వెల్లడించారు.
ట్రంప్‌కు టెస్ట్‌లు చేసిన 15 నిమిషాల్లోనే రిపోర్టు వచ్చిందని, అమెరికా అధ్యక్షుడికి కరోనా లక్షణాలు లేవని స్పష్టం చేశారు. ఈ సంధర్భంగా కరోనాపై విజయం సాధించాలంటే ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, సామాజిక దూరం పాటించాలని ట్రంప్ సూచించారు. ప్రతీ ఒక్కరూ ప్రభుత్వ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించడం ఎంతో ముఖ్యమని, తద్వారా దేశంలో ఎంతో మంది జీవితాలను కాపాడినవారు అవుతారని అన్నారు.
ఇక అమెరికాలో గురువారం వరకు 2,35,000 మంది వైరస్ బారిన పడగా, 5800 మంది మరణించారని వైట్ హౌస్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read | కరోనాతో చనిపోయిన మృతదేహాలకు అంత్యక్రియలు ఎలా చేస్తారో తెలుసా