US : అత్తకో బాయ్ ఫ్రెండ్ కావాలి..కోడలు ప్రకటన, కండీషన్ అప్లై

తన అత్తకో బాయ్ ఫ్రెండ్ కావాలి...అయితే..ఇందులో కొన్ని కండీషన్స్ ఉన్నాయంటూ...ఓ యువతి చేసిన ప్రకటన నెట్టింట హల్ చల్ చేస్తోంది. సాధారణంగా ఉద్యోగాలు, వాహనాల అమ్మకాలు, ఇతరత్రా ప్రకటనలు చూస్తుంటాం..కానీ గిదేం ప్రకటన అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

US : అత్తకో బాయ్ ఫ్రెండ్ కావాలి..కోడలు ప్రకటన, కండీషన్ అప్లై

Boyfriend

Updated On : July 21, 2021 / 3:17 PM IST

Looking For A Boyfriend : తన అత్తకో బాయ్ ఫ్రెండ్ కావాలి…అయితే..ఇందులో కొన్ని కండీషన్స్ ఉన్నాయంటూ…ఓ యువతి చేసిన ప్రకటన నెట్టింట హల్ చల్ చేస్తోంది. సాధారణంగా ఉద్యోగాలు, వాహనాల అమ్మకాలు, ఇతరత్రా ప్రకటనలు చూస్తుంటాం..కానీ గిదేం ప్రకటన అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Read More : Srilanka Toddy : శ్రీలంక కొబ్బరి కల్లుకు విదేశాల్లో భలే గిరాకీ… ఆ టేస్టే వేరు గురూ..

న్యూయార్క్ లోని హడ్సన్ వాలీలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఓ కోడలు తన అత్తగారికి బాయ్ ఫ్రెండ్ కావాలంటూ సోషల్ మీడియాలో ప్రకటన ఇచ్చారు. ఇది తెగ వైరల్ గా మారింది. చాలా మంది అప్లై చేసుకున్నారు. ప్రకటన ఇచ్చిన ఆ కోడలు కొన్ని కండీషన్స్ పెట్టారు. సదరు వ్యక్తి వయస్సు 40 నుంచి 60 ఏళ్లు ఉండాలని, డ్యాన్స్ కూడా వచ్చి ఉండాలని పేర్కొన్నారు.

Read More :Salman Khan : భార్య, కూతుర్ని ఎక్కడ దాచావ్..? తమ్ముడి ప్రశ్నకు షాక్ అయిన సల్లూ భాయ్..

కేవలం రెండు రోజులు వరకు మాత్రమే అత్తకు బాయ్ ఫ్రెండ్ గా ఉండాల్సి ఉంటుందని, ఇందుకు సుమారు 960 డాలర్లు (సుమారు రూ. 72 వేలు) చెల్లించనున్నట్లు యువతి వెల్లడించారు. అసలు అత్తకు బాయ్ ఫ్రెండ్ కావాల్సి వచ్చిందో..కారణం వెల్లడించారు. తాము ఓ స్నేహితురాలి వివాహానికి హాజరు కావాల్సి ఉందని..అక్కడ తన అత్తగారు బోర్ కాకుండా.. ఉండేందుకు ఓ బాయ్ ఫ్రెండ్ ను తోడుగా తీసుకెళ్లాలనుకుంటున్నట్లు ఆ కోడలు వెల్లడించారు. రోజుకు వెయ్యి డాలర్లు..సూపర్ ఆఫర్ అంటూ చాలా మంది అప్లై చేసుకున్నారంట. మరి ఎవరిని బాయ్ ఫ్రెండ్ గా ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.