అదృష్టం తరుముకొచ్చింది : పిచ్చి రాయి అని కొంటే.. వజ్రం అయ్యింది

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 04:11 AM IST
అదృష్టం తరుముకొచ్చింది : పిచ్చి రాయి అని కొంటే.. వజ్రం అయ్యింది

దరిద్రం తరుముకొస్తుంటే.. బంగారం పట్టుకున్నా మట్టే అనే సామెత ఉంది. ఈమె విషయంలో అది రివర్స్. దరిద్రంలో ఉన్నప్పుడు అదృష్టం కోసం జాతి రత్నం రాయి కొనుక్కున్నది. అది కూడా వెయ్యి రూపాయలు పెట్టి. దరిద్రం పోకపోగా.. అదృష్టం కూడా పట్టలేదు. జీవితం అలాగే సాగదీస్తోంది ఆమె. ఏళ్లు గడిచాయి.. ఉన్న డబ్బు కూడా అయిపోయింది. ఎంతలా అంటే.. అదృష్టం కోసం వెయ్యి రూపాయలు (ఇండియన్ కరెన్సీ) పెట్టి కొనుక్కున్న గ్లాస్ రింగ్ కూడా అమ్మేయటానికి సిద్ధపడింది. రాళ్లు, రత్నాలు అమ్మే షాపుకి వెళ్లి ఎంతోకొంత ఇవ్వమని కోరింది. వాళ్లు దాన్ని పరీక్షించారు.

అంతే అవాక్కయ్యారు. షాక్ నుంచి తేరుకుని.. ఇది అసలైన వజ్రం అని చెప్పారు. దీని విలువ కోట్లలో ఉంటుందని వెల్లడించారు. ఆమె కూడా నమ్మలేదు. తనను తాను గిల్లిమరీ పరీక్షించుకున్నది. బతికే ఉన్నానా.. వింటున్నది నిజమేనా అని ఆశ్చర్యపోయింది. తీరిగ్గా తేరుకుని.. కోట్లు.. గీట్లు కాదు.. ఎంత విలువ.. ఎంత ఇస్తారు అని ప్రశ్నించింది. ప్రస్తుత మార్కెట్ ప్రకారం 7లక్షల 40వేల పౌండ్లు ఇస్తామని చెప్పారు. షాపులోనే కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే ఆమెను ఈలోకంలోకి తీసుకొచ్చారు. మన కరెన్సీలో దీని విలువ 6 కోట్ల రూపాయలు. ఇంత డబ్బు జీవితంలో చూడలేదంటూ సంభ్రమాశ్చర్యానికి గురైంది. అసలైన దరిద్రం ఇప్పుడే పోయిందంటూ ఆనందం వ్యక్తం చేసింది.

ఇది ఎక్కడ జరిగిందో తెలుసా. లండన్ లో. ఆమె పేరు డెబ్రా గొడ్డార్డ్. వయస్సు 55 ఏళ్లు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం 10 పౌండ్లు పెట్టి ఈ రాయిని కొనుగోలు చేసింది. 15 ఏళ్లుగా ఆ ఉంగరం నగల బాక్సులోనే ఉంది. ఈ మధ్య తన తల్లి ఓ బంధువు చేతిలో మోసపోయి మొత్తం నగదు కోల్పోయింది. దీంతో ఆమె తన దగ్గర ఉన్న మొత్తం నగలను అమ్మాలని నిర్ణయించుకుంది. వాటిలో ఈ గాజు ఉంగరం కూడా ఉంది. దానికి కూడా విలువ కట్టాలని కోరింది. ఆ ఉంగరాన్ని పరీక్షించిన వ్యాపారి.. అది 26.27 క్యారెట్ల వజ్రం. దాని విలువ 4లక్షల 70వేల పౌండ్స్.. భారత కరెన్సీలో రూ.6.8 కోట్లు తెచ్చిపెట్టింది. ఎవరి జీవితం ఎప్పుడు.. ఎలా మారుతుందో ఎవ్వరికీ తెలియదు.. ఎప్పుడు అదృష్టం.. ఏ రూపంలో తలపుతడుతుందో కూడా తెలియదు.. రాసిపెట్టి ఉంటే ఎలాగైనా వస్తుంది అంటూ నెటిజన్లు అంటున్నారు. మొత్తానికి డెబ్రా గొడ్డార్డ్ జీవితమే మారిపోయింది. వెయ్యి రూపాయల కోసం తన దగ్గర మిగిలి ఉన్న ఏకైక రాయిని అమ్మటానికి వెళితే.. కోట్లు వచ్చాయి..