అమెరికాలో గాంధీ విగ్రహం కూల్చివేత..భారత్ ఆగ్రహం

అమెరికాలో గాంధీ విగ్రహం కూల్చివేత..భారత్ ఆగ్రహం

Updated On : January 30, 2021 / 6:00 PM IST

Demolition of Gandhi statue : అమెరికాలో గాంధీ విగ్రహం కూల్చివేయడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. అదీ..బహుమానంగా ఇచ్చిన విగ్రహాన్ని కూల్చివేస్తారా ? అంటూ భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించింది. ఇది హేయమైన చర్యగా అభివర్ణించింది. బాధ్యులను వెంటనే గుర్తించి..కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసింది.

అమెరికాలో డేవిస్ పట్టణంలో జనవరి 27వ తేదీన కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని కూల్చివేసినట్లు సమాచారం. ఆలస్యంగా ఈ విషయం బయటకు పొక్కింది. శాంతి, సమానత్వానికి ప్రతిక గాంధీ విగ్రహం. దీనిని కూల్చివేయడం హేయమైందని భారత్ పేర్కొంది. 2016లో ఆరడుగుల ఎత్తు, 4 అంగుళాల వెడల్పు, 294 కిలోల బరువున్న గాంధీ కాంస్య విగ్రహాన్ని భారత్ అమెరికాకు బహుమతిగా ఇచ్చింది.

కాలిఫోర్నియా రాష్ట్రంలోని డేవిస్ పట్టణంలోని సెంట్రల్ పార్కులో దీనిని ప్రతిష్టించారు. అయితే..2021, జనవరి 30వ తేదీ మహాత్మాగాంధీ వర్ధంతి రోజునే..ఈ ఘటన వెలుగు చూసింది. భారత్ తీవ్రంగా స్పందించడంతో అమెరికా గవర్నమెంట్ రియాక్ట్ అయ్యింది. భారత రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నామని, వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని డేవిస్ మేయర్ ప్రకటించారు.