షాకింగ్ వీడియో, మహిళ నోట్లో 4 ఫీట్ల పాము

  • Published By: madhu ,Published On : September 1, 2020 / 09:14 AM IST
షాకింగ్ వీడియో, మహిళ నోట్లో 4 ఫీట్ల పాము

Updated On : September 1, 2020 / 10:14 AM IST

మహిళ నోట్లో నాలుగు ఫీట్ల పామును వెలికి తీశారు వైద్యులు. ఒళ్లుగొగురుపొడిచే విధంగా ఉన్నీ ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ తిన్నారు. అసలు..ఆమె కడుపులోకి ఎలా వెళ్లింది ? అప్పటి వరకు ఆమె ఏం చేసింది..నమ్మబుద్ధి కావడం లేదు కదా..కానీ ఇది నిజంగానే జరిగింది. అసలు ఆమె కడుపులోకి ఎలా వెళ్లింది ? తదితర వివరాలు తెలసుకోవాలంటే..చదవండి.



రష్యాలోని డజెస్థాన్ ప్రాంతంలో లెవాషీ గ్రామానికి చెందిన ఓ యువతి..ఎప్పటిలాగానే నిద్ర పోయంది. తెల్లారి లేచింది. కడుపులో ఏదో తిరుగుతున్నట్లు, కడుపంతా తిప్పుతున్నట్లు అనిపించింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లింది. పరీక్షలు నిర్వహించారు.

స్కానింగ్ తీయగా..ఏదో ఆకారం ఉన్నట్లు గుర్తించారు. నోట్లోకి ఓ పైపును పంపించి..అరుదైన ఆపరేషన్ చేశారు. పైపును పట్టుకుని వచ్చిన దానిని షాక్ తిన్నారు. పైపుతో పాటు వచ్చిన పామును చూసిన నర్సు భయాందోళనలకు గురయ్యింది.



ఎలాగో ధైర్యం చేసి పామును మొత్తం బయటకు లాగేసి..అక్కడనే ఉన్న డస్ట్ బిన్ లో పడేసింది. ఆసుపత్రి సిబ్బంది దీనికి సంబంధించిన వీడియోను తీసి సామాజిక మీడియాలో పోస్టు చేశారు. పడుకున్న సమయలో నోరు తెరిచి ఉంచడంతో ఇది జరిగిందంటున్నారు.

మహిళ నోట్లో నాలుగు ఫీట్ల పామును వెలికి తీశారు వైద్యులు.