Donald Trump: మస్క్‌కు షాకిచ్చిన ట్రంప్.. ట్విటర్‌లో రీ ఎంట్రీకి నిరాకరణ.. అసలు కారణం ఏమిటంటే?
ట్విటర్ ఖాతాను పునరుద్దరించిన తరువాత ట్రంప్ స్పందించలేదు. ఎలాంటి పోస్టులు చేయలేదు. తాజాగా ట్రంప్ ఈ అంశంపై స్పందించినట్లు తెలుస్తోంది. ట్విటర్ ఖాతాలోకి రావటం తనకు ఇష్టం లేదని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది.

Donald Trump
Donald Trump: ఎలాన్ మస్క్ ట్విటర్‌ను హస్తగతం చేసుకున్న తరువాత మాజీ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్దరించారు. అంతకుముందు రోజు ట్విటర్‌లో డొనాల్డ్ ట్రంప్ ఖాతాను పునరుద్దరించాలా? వద్దా అనే అంశంపై మస్క్ ఓటింగ్ పెట్టాడు. ఈ ఓటింగ్ లో 51శాతంకుపైగా నెటిజన్లు ట్రంప్ ట్విటర్ ఖాతాను పునరుద్దరించాలని మద్దతుగా నిలిచారు. దీంతో మస్క్ వెంటనే ట్రంప్ ఖాతాను పునరుద్దరించారు. అయితే, ఇంతచేసిన మస్క్ కు ట్రంప్ షాకిచ్చినట్లు తెలుస్తోంది.
ట్విటర్ ఖాతాను పునరుద్దరించిన తరువాత ట్రంప్ స్పందించలేదు. ఎలాంటి పోస్టులు చేయలేదు. తాజాగా ట్రంప్ ఈ అంశంపై స్పందించినట్లు తెలుస్తోంది. ట్విటర్ ఖాతాలోకి రావటం తనకు ఇష్టం లేదని ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం.. ఖాతా పునరుద్ధరించబడిన తర్వాత వీడియో కాన్ఫరెన్సింగ్‌లో మాజీ అధ్యక్షుడు ట్రంప్.. నేను ట్విట్టర్‌లో ఉండటానికి ఎటువంటి కారణం లేదు. దీనికి కారణం నాకు కనిపించడం లేదు. ట్విట్టర్ ఇప్పుడు నకిలీ ఖాతాలతో నిండిపోయింది. నేను ఎదుర్కొన్న సమస్యలు నమ్మశక్యం కానివి అని ట్రంప్ అన్నట్లు తెలిసింది.
ట్విటర్ ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ ను ట్రంప్ ప్రశంసించినట్లు తెలిసింది. అయితే ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ఉండటానికే ఇష్టపడతానని స్పష్టం చేసినట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి.. 6 జనవరి 2021న యూఎస్ క్యాపిటల్‌లో అల్లర్లు జరిగాయి. డోనాల్డ్ ట్రంప్ కొంత వరకు దీనికి బాధ్యత వహించారు. అల్లర్లలో అతని పాత్రపై అమెరికాలో కూడా విచారణ జరుగుతోంది. అదే సమయంలో అతను తన మద్దతుదారులతో ఎక్కువగా ట్విట్టర్లో మాట్లాడేవాడు. ఈ క్రమంలో పలు వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో అల్లర్ల తర్వాత అతను సోషల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ నుండి నిషేధించబడ్డాడు. అప్పటి నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు తన సోషల్ నెట్‌వర్కింగ్ యాప్ ట్రూత్ సోషల్‌లో యాక్టివ్‌గా ఉన్నారు.