ట్రంప్ మళ్లీ మొదలెట్టాడు.. ఇండియాకి షాక్.. వాటిపై అదనపు సుంకాలు..?
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశానికి మరో బిగ్‌షాకిచ్చేందుకు సిద్ధమయ్యాడు. అమెరికా రైతుల కోసం 12 బిలియన్ డాలర్ల ..
Donald Trump
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత దేశానికి మరో బిగ్‌షాకిచ్చేందుకు సిద్ధమయ్యాడు. అమెరికా రైతుల కోసం 12 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని ట్రంప్ సర్కార్ ప్రకటించింది. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు దేశాలు తమ బియ్యాన్ని యూఎస్ మార్కెట్‌లలోకి తక్కువ ధరలకు డంపింగ్ చేస్తున్నాయని రైతులు ఆరోపించారు. ఇది తమకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి అమెరికా – భారత్ చర్చలకు సిద్ధమవుతున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. భారత దేశం నుంచి దిగుమతి అయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించేందుకు ట్రంప్ సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు త్వరలో నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. వైట్‌హౌస్‌లో జరిగిన సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. పలు దేశాలు చౌక ధరలకే బియ్యాన్ని అమెరికా మార్కెట్లోకి డంప్ చేస్తున్నాయంటూ వస్తున్న వాదనలను తమ ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు.
అమెరికా మార్కెట్లలోకి అన్యాయంగా వస్తువులను డంపింగ్ చేస్తూ, పలు దేశాలు తమను మోసం చేస్తున్నాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా రైతుల ఉత్పత్తులను దెబ్బతీసేలా ఉన్న దేశాల జాబితాను సమర్పించాలని ట్రజెరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ను ట్రంప్ ఆదేశించారు. వీటిలో భారత్, థాయ్‌లాండ్, చైనా దేశాలు ముందున్నాయని, మరిన్ని దేశాలు కూడా ఉన్నాయని, దీనికి సంబంధించి పూర్తి జాబితాను అందిస్తామని చెప్పారు.
స్పందించిన ట్రంప్.. వీటిపై సత్వరం చర్యలు తీసుకుంటామని అక్కడి రైతులకు హామీ ఇచ్చారు. దీంతో బారతదేశం నుంచి అమెరికాకు ఎగుమతి అవుతున్న బియ్యంపై త్వరలో ట్రంప్ సర్కార్ అదనపు సుంకాలు విధించే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని అమెరికా మీడియా పేర్కొంది.. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ట్రంప్ అదనపు సుంకాల గురించి యోచిస్తున్నట్లు పేర్కొంది.
