కరోనాకు ‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ పనిచేస్తుందని ట్రంప్ చెప్పింది తప్పంటున్న అధ్యయనాలు.. అసలు వాస్తవాలివే!

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి సరైన మందు లేదు. covid-19వైరస్ నివారణ లేదా చికిత్స కోసం ఎన్నో చికిత్సలపై అధ్యయనాలు జరుగుతున్నాయి. కానీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కరోనా నివారణకు ‘హైడ్రాక్సీక్లోరోక్విన్’ అద్భుతంగా పనిచేస్తుందని చెప్పడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైడ్రాక్సీక్లోరోక్విన్.. ప్రస్తుతం మలేరియా, లూపస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ చికిత్సకు ఉపయోగిస్తున్న ఔషధం.
ఈ ఔషధాన్ని కరోనా నివారణకు పనిచేస్తుందని ట్రంప్ చెప్పింది తప్పు అని చెబుతున్నాయి. గత నెలలో ట్రంప్ హైడ్రాక్సీక్లోరోక్విన్ గురించి ప్రకటన చేశారు. ట్రంప్ చెప్పిన విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో CNN అనేకసార్లు ఫ్యాక్ట్ చెకింగ్ చేసింది. ఇందులో అధ్యక్షుడు కేవలం అవాస్తవికంగా మాట్లాడినట్టు గుర్తించారు.
అసలు వాస్తవాలు ఇవే :
కరోనావైరస్ నివారణకు హైడ్రాక్సీక్లోరోక్విన్ పనిచేస్తుందో లేదో తెలిసే వరకు?
మార్చి 29న ట్రంప్ ఈ ఔషధం పనిచేస్తుందని అన్నారు. ఈ ఔషధం పనిచేసేది.. వారాలు లేదా నెలలు మాత్రమేనని అంటున్నారు వైద్యులు. 15 పరిశోధనా కేంద్రాలలో ఔషధంపై ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఆరు రీసెర్చ్ సెంటర్లు స్పందించగా, మూడు వారాల నుండి నాలుగు నెలల మధ్య సమయం పడుతుందని డాక్టర్లు చెప్పారు.
ఫ్రెంచ్ పరిశోధకులు.. ఇప్పటికే కరోనావైరస్ చికిత్సగా హైడ్రాక్సీక్లోరోక్విన్ పనితీరుపై అధ్యయనం చేశారు. అది చెప్పలేదా?
… అని అడిగితే ట్రంప్ అవును అని చెప్పారు. ఏప్రిల్ 5న ‘ వెరీ గుడ్ టెస్టు’ అని ట్రంప్ పిలుపునిచ్చారు. ఈ అధ్యయనం ఎంతో భయంకరమైనదని వైద్యులు అంటున్నారు. ఔషధాన్ని తీసుకున్నవారిలో తీవ్రమైన దుష్ప్రభావాలను గుర్తించినట్టు చెబుతున్నాయి. నిపుణులు ఫ్రెంచ్ అధ్యయనాన్ని సిఎన్‌ఎన్‌కు ‘పూర్తి వైఫల్యం’ ‘ఉత్సుకత’గా అభివర్ణించారు. దీనిపై చాలా విమర్శలు వచ్చాయి. ఈ విషయాంపై కథనాన్ని ప్రచురించిన మీడియా సైతం మళ్ళీ సమీక్షిస్తోంది.
కరోనావైరస్ రోగులకు హైడ్రాక్సీక్లోరోక్విన్ సురక్షితమేనా?
ట్రంప్ అవును అని అన్నారు. దీనివల్ల మీకు పోయేదేంటి? తీసుకోండి అంటూ ఏప్రిల్ 4న ట్రంప్ చెప్పారు. ఔషధం తీవ్రమైన దుష్ప్రభావాలను కలిగిస్తుందని వైద్యులు అంటున్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్ బ్రాండ్ అయిన ప్లాక్వెనిల్ లేబుల్.. ఈ డ్రగ్ వాడే రోగులకు ప్రాణాంతకం మాత్రమే కాదు.. ప్రాణాంతక గుండె సమస్యలు, కోలుకోలేని దృష్టి సమస్యలు వస్తాయని నివేదించినట్టు చెప్పారు.