ISIS-K : డ్రోన్లతో దాడి, ఇద్దరు ఉగ్రనేతలు మృత్యువాత..పెంటగాన్ ప్రకటన
అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. హెచ్చరించిన గంటల్లోనే తానేంటో నిరూపించుకుంది. తమ పౌరులను పొట్టన పెట్టకున్న వారిని వేటాడి.. వెంటాడి హతమార్చింది.

America Drone
Drone Strike : అమెరికా ప్రతీకారం తీర్చుకుంది. హెచ్చరించిన గంటల్లోనే తానేంటో నిరూపించుకుంది. తమ పౌరులను పొట్టన పెట్టకున్న వారిని వేటాడి.. వెంటాడి హతమార్చింది. అప్ఘానిస్తాన్‌ను తాలిబన్ల చేతుల్లో పెట్టి ప్రపంచ వ్యాప్తంగా అందరితో చివాట్లు తింటున్న అమెరికా నష్ట నివారణా చర్యలు ప్రారంభించింది. కాబుల్ ఎయిర్‌పోర్టులో పేలుళ్లకు పాల్పడి వందల మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాదుల అంతు చూడటం మొదలు పెట్టింది.
Read More : అప్ఘానిస్తాన్‌లో అమెరికా ప్రతీకారం
వెంటాడుతాం… వేటాడుతాం… ఎక్కడ నక్కినా హతమార్చుతామంటూ ప్రకటించిన రెండు రోజులకే ఆ పని పూర్తి చేసింది అమెరికా.
ఐసిస్-Kపై అమెరికా జరిపిన దాడుల్లో ఒకరు కాదు.. ఇద్దరు ఉగ్రనేతలు మృత్యువాత పడ్డారు. ఎయిర్ స్ట్రైక్‌లో ఇద్దరు చనిపోయినట్టుగా ప్రకటించింది పెంటగాన్. కాబూల్ దాడికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించిన గంటల్లోనే ఐసిస్-K స్థావరాలపై అమెరికా దాడులు చేసింది. ఉగ్రదాడికి ప్లాన్ చేసిన ఐసిస్ K టాప్ లీడర్‌ను హతమార్చినట్టు ముందుగా ప్రకటించాయి అమెరికా బలగాలు. కానీ మరో అగ్రనేత కూడా చనిపోయినట్టు ప్రకటించింది పెంటగాన్.
Read More : World Bank : అప్ఘానిస్తాన్‌కు నిధులు నిలిపేసిన ప్రపంచ బ్యాంకు
అఫ్ఘాన్‌కు తూర్పు భాగంలో ఉన్న నాంగర్‌హార్ ప్రావిన్స్‌కు మానవరహిత డ్రోన్‌ను పంపించిన అమెరికా.. ఎవరికీ అనుమానం రాకుండా ఆపరేషన్ పూర్తి చేసింది. కాబుల్ ఎయిర్‌పోర్టులో పేలుళ్లకు పాల్పడి 180 మందికి పైగా ప్రాణాలు తీసిన ఉగ్రవాద సంస్థను అమెరికా బలగాలు టార్గెట్ చేశాయి. అధ్యక్షుడు జో బైడెన్ నుంచి ఆదేశాలు అందగానే… అఫ్ఘాన్‌లోని అమెరికా సైన్యం… ఐసిస్ స్థావరాలున్న నాంగర్‌హర్ ప్రావిన్స్‌పై డ్రోన్‌తో దండెత్తింది.
Read More : Taliban : అప్ఘానిస్తాన్ లో సీన్ రివర్స్..300మంది తాలిబన్లను చంపేసిన ప్రజలు
పేలుళ్ల మాస్టర్ మైండ్.. ఓ వాహనంలో వెళ్తుండగా.. డ్రోన్‌తో టార్గెట్ చేసి హతమార్చింది. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టార్గెట్‌పై డ్రోన్ దాడులు చేసింది. అయితే..మరణించిన ఐసిస్ వ్యూహకర్తలకు కాబూల్ దాడితో సంబంధం ఉందో, లేదో తెలియరాలేదు. ఉగ్రమూకలు మరిన్ని దాడులు జరిపే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలు హెచ్చరించడంతో ఈ దాడులకు అమెరికా మిలటరీ దిగింది.