Cat Rescue : గర్భంతో ఉన్న పిల్లిని పట్టారు, రూ.10లక్షలు సంపాదించారు

అదృష్ట దేవత ఒక్కొక్కరిని ఒక్కో రూపంలో పలకరిస్తూ ఉంటుంది. కొందరికి లాటరీ రూపంలో అదృష్టం వరిస్తుంది. వారికి మాత్రం పిల్లి రూపంలో అదృష్టం వ‌చ్చింది. ఆ పిల్లే వారికి 10 లక్ష‌ల

Cat Rescue : గర్భంతో ఉన్న పిల్లిని పట్టారు, రూ.10లక్షలు సంపాదించారు

Cat Rescue

Updated On : August 28, 2021 / 11:51 PM IST

Cat Rescue : అదృష్ట దేవత ఒక్కొక్కరిని ఒక్కో రూపంలో పలకరిస్తూ ఉంటుంది. కొందరికి లాటరీ రూపంలో అదృష్టం వరిస్తుంది. వారికి మాత్రం పిల్లి రూపంలో అదృష్టం వ‌చ్చింది. ఆ పిల్లే వారికి 10 లక్ష‌ల రివార్డు వ‌చ్చేలా చేసింది. గర్భంతో ఉన్న పిల్లిని కాపాడి వారు రూ.10లక్షలు రివార్డు పొందారు.

Covaxin Single Dose : వారికి కోవాగ్జిన్ ఒక్క టీకా డోసు చాలు.. ICMR గుడ్‌న్యూస్

గర్భంతో ఉన్న ఓ పిల్లి ప్రమాదవశాత్తు భవనం పైనుంచి పడిపోతుండగా రక్షించిన ఓ బృందాన్ని అదృష్టం వరించింది. ఈ ఘటన దుబాయ్ లో జరిగింది. పిల్లిని కాపాడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఏకంగా దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బీప్ రషీద్ చూశారు. పిల్లి ప్రాణాలు కాపాడిన నలుగురిని మెచ్చుకుంటూ రూ.10లక్షల రివార్డును ప్రకటించారు. పిల్లిని కాపాడిన నలుగురిలో ఒకరు కేరళ వాసి అష్రఫ్ కూడా ఉన్నారు. అష్రఫ్ అక్కడ సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు.

రెండో ఫ్లోర్ నుంచి ఓ పిల్లి కింద ప‌డుతుండ‌టం ఇద్దరు వ్యక్తులు గ‌మనించారు. వెంట‌నే ఓ బెడ్ షీట్ ప‌ట్టుకొని.. నిల‌బ‌డ్డారు. ఆ పిల్లికి ప‌ట్టు దొర‌క‌క.. రెండో ఫ్లోర్ బాల్క‌నీ నుంచి కింద ప‌డ‌బోతుండ‌గా.. బెడ్ షీట్‌ను అడ్డంగా పెట్టారు. దీంతో ఆ పిల్లి బెడ్ షీట్‌లో ప‌డి ప్రాణాలు ద‌క్కించుకుంది. ఆ పిల్లి గర్భంతో ఉంది. దాన్ని కాపాడిన వారిని స్థానికులు మెచ్చుకున్నారు.

Bollywood Stars Bodyguards : అమితాబ్ నుంచి షారుక్ ఖాన్ వరకు.. బాడీగార్డులకు కోట్లు చెల్లిస్తున్న స్టార్స్

నలుగురిలో ఒకరు అతీప్ మెహ్ మూద్(పాకిస్తానీ సేల్స్ మెన్), నాసర్(భారత్ కు చెందిన డ్రైవర్), మహమ్మద్ రషీద్(వీడియో తీసిన వ్యక్తి) మరొకరు అష్రఫ్. మరో విశేషం ఏంటంటే.. ఈ నలుగురిలో ముగ్గురు ఒకరికొకరు అస్సలు పరిచయం లేదు. పిల్లిని కాపాడే క్రమంలో నలుగురూ ముందుకు వచ్చారు. పిల్లిని కాపాడేందుకు మేం నలుగురు ముందుకు వచ్చామని తెలిపారు.