Morgue : శవాల బ్యాగులో కళ్లు తెరిచి చూసిన వృద్ధురాలు .. రెండు డెత్ సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లు

తెల్లవారుజామున 1.30గంటల సమయంలో శ్మశానంలో శవాల బ్యాగు నుంచి కదలికలు కనిపించటంతో శవాగారంలో ఉన్న సిబ్బంది భయం భయంగా దగ్గరకెళ్లి చూశారు. వణుకుతున్న చేతులతో బ్యాగ్ జిప్ తీసి చూశారు..అంతే భయంతో వణికిపోయారు. ఆ బ్యాగులో శవం కళ్లు తెరిచి తనవైపే దీక్షగా చూస్తోంది.

Morgue : శవాల బ్యాగులో కళ్లు తెరిచి చూసిన వృద్ధురాలు .. రెండు డెత్ సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టర్లు

woman Alive In Morgue

woman Alive In Morgue : తెల్లవారుజామున 1.30గంటల సమయంలో శ్మశానంలో శవాల బ్యాగు నుంచి కదలికలు కనిపించటంతో శవాగారంలో ఉన్న సిబ్బందిలో ఓ వ్యక్తి భయం భయంగా దగ్గరకెళ్లి చూశాడు. వణుకుతున్న చేతులతో బ్యాగ్ జిప్ తీసి చూశాడు..అంతే భయంతో వణికిపోయాడు. ఎందుకంటే ఆ బ్యాగులో శవం కళ్లు తెరిచి తనవైపే దీక్షగా చూస్తోంది. దీంతో అతను హడలిపోయాడు. కాస్త దూరంగా పారిపోయాడు. భయంగానే మళ్లీ బ్యాగువైపు చూశాడు. అలాగే కదులుతు ఉంది. కూడదీసుకున్న ధైర్యంతో వణుకుతున్న కాళ్లతో మళ్లీ దగ్గరకెళ్లి చూశాడు.  అదే చూపు..కొన్ని గంటల క్రితం శవాగారానికి వచ్చిన ఓ బ్యాగులో వృద్ధురాలి శవం తనవైపే తీక్షణంగా చూస్తుంటే హడలిపోయాడు.గుండెలు చిక్కబట్టుకుని కాసేపు దీక్షగా చూశాడు. ఆమె అలా చూస్తునే ఉంది..!!

ఈ ఘటన బ్రెజిల్ లోని శాన్ జోస్ నగరంలో చోటుచేసుకుంది. జీవించి ఉన్న వృద్ధురాలిని చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించి శవాగారానికి తరలించగా అక్కడ ఆమెను ఉంచిన శవాల బ్యాగు నుంచి కదలికలు రావటంతో ఈవిషయం బయటపడింది. దీంతో ఆమెను ఆమె బంధువులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతు ఆమె చనిపోయింది. ఈ ఘటనపై సదరు మృతురాలి బంధువులు ఫిర్యాదు చేయగా బ్రెజిల్ ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

మంచిర్యాలలో నలుగురు మావోయిస్టులు అరెస్ట్ ..

కాగా..కాలేయ సమస్యతో బాధపడుతున్న నోర్మా సిల్వీరా డ సిల్వా అనే 90 ఏళ్ల వృద్ధురాలిని ఆమె బంధువులు గత శుక్రవారం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతు ఆమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ఆమెను పరీక్షించిన వైద్యులు చనిపోయిందని నిర్దారించారు. మృతదేహాన్ని బ్యాగులో చుట్టి శవాగారానికి తరలించారు. శనివారం ఆమె కుటుంబ సభ్యులు వచ్చినా చూడటానికి కూడా అనుమతించలేదు.

దీంతో వారు శనివారం నోర్మాను చివరిసారి చూసేందుకు శ్మశానానికి వెళ్లగా అక్కడి సిబ్బంది శుక్రవారం తెల్లవారుజామున (తెల్లారితే శనివారం) 1.30గంటలకు జరిగిన విషయం చెప్పారు. దీంతో వారు ఆత్రంగా చూశారు. అప్పటికి ఆమె చూస్తునే ఉంది. అప్పటికి వారికి నమ్మకం కుదరక..శరీరంపై చేయి వేసి చూడగా వెచ్చగా ఉంది. నాడిని పరిశీలించగా కొట్టుకుంటునే ఉంది. అంతే..వెంటనే ఆస్పత్రికి తరలించారు.

డాక్టర్లు వెంటనే చికిత్స ప్రారంభించారు. కానీ ఆమె సోమవారం ఉదయం చనిపోయింది. దీంతో మృతురాలి బంధువులు నోర్మా బతికి ఉండగానే బ్యాగులో పెట్టడం వల్లే ఊపిరి ఆడక చనిపోయిందని ఆరోపిస్తు ఫిర్యాదు చేశారు. నోర్మా చనిపోయిందని నిర్ధారిస్తు డాక్టర్లు ఇచ్చిన డెత్ సర్టిఫికెట్ ను ఇచ్చారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కాగా ..మొదటిసారి నోర్మా చనిపోయినట్టు డాక్టర్లు రెండోసారి డెత్ సర్టిఫికెట్ ఇవ్వటం గమనించాల్సిన విషయం. అదే విషయాన్ని నోర్మా కుటుంబ సభ్యులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జీవించి ఉండగానే చనిపోయిందని నిర్ధారించి ఆమె మరణానికి కారణమైనవారికిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.