చైనా ఫేస్ మాస్క్‌లు, కరోనా టెస్ట్ కిట్స్ నాసిరకం.. చెత్త బుట్టలో పారేస్తున్న యూరోపియన్ దేశాలు 

  • Published By: sreehari ,Published On : March 31, 2020 / 06:12 AM IST
చైనా ఫేస్ మాస్క్‌లు, కరోనా టెస్ట్ కిట్స్ నాసిరకం.. చెత్త బుట్టలో పారేస్తున్న యూరోపియన్ దేశాలు 

Updated On : March 31, 2020 / 6:12 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలోనే కరోనా ఉద్భవించింది. అక్కడి నుంచి ప్రపంచ దేశాలకు వైరస్ వ్యాప్తి చెందుతోంది. కరోనా తీవ్రత నుంచి బయటపడిన చైనా.. ప్రపంచ దేశాలకు కూడా తనవంతు సాయం అందిస్తోంది. వైరస్ ప్రభావంతో విలవిలాడిపోతున్న ప్రపంచ దేశాలకు ఇతర దేశాలతో పాటు చైనా కూడా వైద్య పరికరాలు, ఫేస్ మాస్క్‌లు, టెస్ట్ కిట్స్ సరఫరా చేస్తోంది.

చైనా పంపిన కరోనా వైరస్ నిర్ధారణ టెస్టు కిట్స్ నాసిరకంగా ఉండటంతో యూరోపియన్ దేశాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సరైన సమయంలో వైరస్ నిర్ధారణ ఆలస్యం కావడంతో వందలాది మంది మృతిచెందారు. చైనా సరఫరా చేసిన నాసికరం టెస్టులు, ఫేస్ మాస్క్ ల నాణత్య లోపం కారణంగానే పరిస్థితి తీవ్రంగా మారిందని యూరోపియన్ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

చైనా పంపే ఫేస్ మాస్క్ లు, టెస్టు కిట్స్ వాడొద్దని గట్టిగా నిర్ణయించుకున్నాయి. అందులో యూరోపియన్ దేశమైన నెదార్లాండ్స్ ముందుగా ఈ నిర్ణయాన్ని తీసుకుంది. చైనా తయారు చేసిన ఫేస్ మాస్క్ లు, టెస్టు కిట్లను బయట పారేసింది. నాణ్యమైన టెస్టుల్లో విఫలమైన తర్వాత ఆస్పత్రి నుంచి మిలియన్ సగానికి పైగా ఫేస్ మాస్క్ లను రీకాల్ చేస్తోంది. డచ్ ప్రభుత్వం ఇప్పటికే 6లక్షలు FFP2 మాస్క్‌లను ఆస్పత్రుల నుంచి రీకాల్ చేయాలని ప్రకటించింది. ఆరోగ్య కార్యకర్తలకు చైనా తయారుచేసిన మాస్క్ లను వాడొద్దని సూచించినట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

మరో 7లక్షల మాస్క్ లను రవాణా ద్వారా డెలివరీ అయ్యాయి. అయితే ఈ మాస్క్ లను పంపిణీ చేయొద్దని తెలిపారు. ఇదివరకే కొన్ని ఆస్పత్రులు చైనా మాస్క్ లను తిరస్కరించినట్టు డచ్ పబ్లిక్ బ్రాడ్ క్యాస్టర్ NOS నివేదించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రొటెక్టివ్ ఎక్విప్ మెంట్ కొరత నేపథ్యంలో ఇలాంటి పరిస్థితిపై మంత్రిత్వ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత అత్యవసర పరిస్థితిలో కొత్త సప్లయర్లతో ఈ సమస్యను అధిగమించేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వాలకు సూచించింది. 

మాస్క్ ల కొరత ఏర్పడటంతో మార్కెట్లో కొంతమంది లాభం కోసం అధిక ధరలకు విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని కేథరినా ఆస్పత్రిలోని ఒక బాధితుడు వాపోయాడు.  మరోవైపు నెదర్లాండ్స్ లోని చైనా రాయబారి కార్యాలయం దగ్గర నుంచి పరిస్థితిని సమీక్షిస్తోంది. డచ్ విచారణ అధికారుల సాయంతో అవసరమైతే నాణ్యమైన మాస్క్ లను పంపించేందుకు ప్రయత్నిస్తామని తెలిపింది. 

బెల్జియంలోని లివెన్ యూనివర్శిటీ ఆస్పత్రిలో కూడా 3వేల వరకు చైనా మాస్క్‌లను తిరస్కరించింది. ఇటలీ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యధిక కరోనా మృతులు నమోదైన దేశంగా స్పెయిన్ 8,000 రాపిడ్ టెస్టింగ్ కిట్స్ విత్ డ్రా చేసుకుంది. మాడ్రిడ్ లోని అధికారులకు ఈ కిట్స్ పంపిణీ చేశారు. ఆ తర్వాత మరో 50వేల వరకు తిరిగి చైనాకు పంపించారు. చైనా పంపిన కిట్స్ లో కేవలం 30 శాతం మాత్రమే కచ్చితత్వం ఉందని అధికారులు రివ్యూ చేశారు.