Iran Hijab Bill : ఇరాన్‌లో హిజాబ్ తప్పనిసరి .. ఉల్లంఘిస్తే 10 ఏళ్లు జైలు శిక్ష,భారీ జరిమానా

స్విట్జర్లాండ్ లో బురఖా ధరిస్తే జరిమానా తప్పదనే బిల్లుకు ఆమోదం తెలిపితే .. ఇరాన్ ప్రభుత్వం బురఖా ధరించకపోతే జైలుశిక్ష విధించే బిల్లుకు ఆమోదం పలికింది. ఇరాన్ లో హిజాబ్ ధరించకపోతే జరిమానా కాదు ఏకంగా జైలు శిక్షే అని ప్రకటించింది.

Iran Hijab Bill : ఇరాన్‌లో హిజాబ్ తప్పనిసరి ..  ఉల్లంఘిస్తే 10 ఏళ్లు జైలు శిక్ష,భారీ జరిమానా

iran parliament approves hijab bill

Iran parliament approves hijab bill : హిజాబ్. భారత్ లోని కొన్ని ప్రాంతాల్లోని విద్యాసంస్థల్లో ఎంత వివాదమైందో తెలిసిందే. బురఖా (హిజాబ్ ) విషయంలో ఎన్నో వివాదాలు ఉన్న విషయం తెలిసిందే. ఈక్రమంలో స్విట్జర్లాండ్ ( Switzerland)పార్లమెంట్ (parliament) బురఖాను నిషేధిస్తు తెచ్చిన బిల్లుకు ఆమోదం పలికింది. మరోపక్క బురఖా ధరించకపోతే 10 ఏళ్లు జైలు శిక్ష విధించే చట్టాన్ని తీసుకొచ్చి బిల్లును ఆమోదించింది ఇరాన్ ప్రభుత్వం. స్విట్జర్లాండ్ లో బురఖా ధరిస్తే జరిమానా తప్పదనే బిల్లుకు ఆమోదం తెలిపితే ఇరాన్ మాత్రం బురఖా ధరించకపోతే జైలుశిక్ష విధించే బిల్లుకు ఆమోదం పలికింది. ఇరాన్ లో హిజాబ్ ధరించకపోతే జరిమానా కాదు ఏకంగా జైలు శిక్షే అని ప్రకటించింది.

అంతేకాదు ఇంకా ఎన్నో కఠిన శిక్షలు కూడా ఉంటాయి ఈ బిల్లు చట్టంగా మారితే. అటువంటి బిల్లుకు ఇరాన్ పార్లమెంట్ (Iran parliament ) బుధవారం (సెప్టెంబర్ 20,2023) ఆమోదం పలికింది. సాధారణంగా ఇస్లామిక్ దేశాల్లో హిజాబ్ అనేది తప్పనిసరి. ముసుగులేనిదే మహిళలు బయటకు అడుగు పెట్టకూడదనే ఆంక్షలుంటాయి ఇస్లామిక్ దేశాల్లో..ఈక్రమంలో ఇరాన్ హిజాబ్ ను తప్పనిసరి చేస్తు చట్టాన్ని చేసింది. ఇరాన్ లో మహ్సా అమినీ అనే మహిళ మరణం దేశ వ్యాప్తంగా ఎంతటి హింసాత్మక ఘటనలు జరిగాయో తెలిసిందే. ఆమె మరణం తరువాత తరువాత హిజాబ్ విషయంలో ఇరాన్‌లో వార్తల్లో నిలుస్తూనే ఉంది.

Burqas Baned : బుర్ఖా వేసుకుంటే భారీ జరిమానా .. కొత్త చట్టం తెచ్చిన దేశం

తాజాగా హిజాబ్ ధరించే విషయాన్ని ఏకంగా చట్టం చేసేందుకు బిల్లును ఆమోదించింది. దీనిని ఉల్లంఘిస్తే 10 సంవత్సరాల జైలు శిక్ష విధించనుంది. అంతేకాదు 60 కొరడా దెబ్బలు, వేలాది ఇరాన్‌లను జరిమానా కూడా విధించే విధంగా చట్టాన్ని తీసుకుని రావడానికి రెడీ అవుతోంది. విశేషమేమిటంటే మహ్సా అమినీ మరణించి సరిగ్గా ఏడాది తర్వాత ఈ కొత్త చట్టం కోసం బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పలకటం గమనించాల్సిన విషయం.

ఇస్లాం సంప్రదాయం ప్రకారం బహిరంగ ప్రదేశాల్లో మహిళలు కచ్చితంగా హిజాబ్‌ (Hijab ) ధరించాల్సిందే అని స్పష్టం చేసింది. హిజాబ్‌ ధరించేందుకు విముఖత వ్యక్తం చేసే మహిళలకు, వారికి మద్దతు తెలిపే వారిపై భారీ శిక్షలు విధించేందుకు సిద్ధమైంది. బిల్లును ఇరాన్‌ పార్లమెంట్‌ బుధవారం ఆమోదం తెలిపింది.

ఈ బిల్లు ప్రకారం..హిజాబ్‌ తప్పనిసరిగా ధరించితీరాల్సిందే. హిజాబ్ ధరించకుండా విధులు నిర్వహించేందుకు అనుమతించే వ్యాపార సంస్థలతో పాటు హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టే కార్యకర్తలపై కూడా శిక్షలు విధించనుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి కనీసం 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.

Chennai : క్యాబ్‌ డ్రైవర్‌ అకౌంట్లోకి రూ.9వేల కోట్లు .. షాక్ నుంచి కోలుకునే లోపే మరో షాక్..!

కాగా ఇస్లాం దేశమైన ఇరాన్ లో మ‌హిళ‌ల‌పై ఆంక్షలు చాలా ఎక్కువగానే ఉంటాయి. మరీ ముఖ్యంగా వారి ధరించే దుస్తుల విషయంలో‌. హిజాబ్ తప్పనిసరి. ఇది కచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఈ ఆంక్షలు ఎంత దారుణంగా ఉంటాయంటే ఇరాన్ లో మహిళు డ్రెస్ కోడ్‌పై మోర‌ల్ పోలీసుల నిఘా ఉంటుంది. దీన్ని బట్టి ఊహించుకోవచ్చు. హిజాబ్ స‌రిగా ధ‌రించ‌కపోతే పోలీసులు ఏదారుణానికైనా తెగిస్తారు అనేదినాకి నిదర్శనం మహ్సా అమినీ అనే మహిళ మరణం.

గతేడాది సెప్టెంబ‌ర్ 20వ తేదీన మోర‌ల్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె హిజాబ్ ను సరిగా ధరించలేదనే కారణంతో 22 ఏళ్ల అమీనీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత మూడు రోజులకు ఆమె పోలీసు క‌స్టడీలో చ‌నిపోయింది. 2022 సెప్టెంబర్‌ 16న జరిగిన ఈ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజ‌లు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి నిర‌స‌న ప్రద‌ర్శన‌లు చేప‌ట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 3 నెల‌లుగా హిజాబ్, మోర‌ల్ పోలీసింగ్‌ వ్యతిరేక నినాదాలు, నిర‌స‌న‌ల‌తో ఇరాన్ అట్టుడికింది. ఈ నిర‌స‌నల్లో సుమారు 500 మందికిపైగా పౌరులు చనిపోయారు. వేలాదిమందిని నిర్భంధించారు.

Canada : కెనడాలోమరో సంచలన హత్య .. ఖలిస్థాన్ ఉగ్రవాది సఖ్‌దూల్‌ సింగ్‌ హతం

ఇరాన్‌లో 1979 విప్లవం తరువాత ఆ స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేక‌త పెర‌గ‌డం ఇదే మొద‌టిసారి అనేలా జరిగాయి దారుణాలు. నిరంతరం ప్రజలు చేసిన తీవ్ర నిరసనలతో ప్రభుత్వం దిగొచ్చింది. ప్రభుత్వం మోర‌ల్ పోలీసింగ్‌ వ్యవస్థను కూడా నిషేధించింది. కానీ తాజాగా హిజాబ్ తప్పనిసరి అంటూ ఏకంగా చట్టం చేయటానికి బిల్లుకు ఆమోదం పలకటం గమనించాల్సిన విషయం.