Erica Robin : తొలిసారిగా మిస్ యూనివర్స్ పాకిస్తాన్ ఎరికా రాబిన్ గురించి మీకు తెలియని వాస్తవాలు

మిస్ యూనివర్స్ పోటీల్లో పాకిస్తాన్ మోడల్ ఎరికా రాబిన్ కిరీటం దక్కించుకున్న సంగతి తెలిసిందే. అసలు ఎవరీ ఎరికా రాబిన్? చదవండి.

Erica Robin : తొలిసారిగా మిస్ యూనివర్స్ పాకిస్తాన్ ఎరికా రాబిన్ గురించి మీకు తెలియని వాస్తవాలు

Erica Robin

Updated On : September 16, 2023 / 6:46 PM IST

Erica Robin : పాకిస్తాన్ మోడల్ ఎరికా రాబిన్  ‘మిస్ యూనివర్స్ ‘ పోటీల్లో కిరీటం దక్కించుకుంది.  ఎరికా రాబిన్ గురించి మీకు తెలియని కొన్ని వాస్తవాలు చదవండి.

Miss Universe: మోడళ్లకు గుడ్‌న్యూస్.. మిస్ యూనివర్స్ పోటీలకు గరిష్ఠ వయోపరిమితి ఇకపై..

24 ఏళ్ల మోడల్ ఎరికా రాబిన్ గురువారం మాల్దీవులలో జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచింది. తొలిసారి పాకిస్తాన్‌కి ప్రాతినిధ్యం వహించి ‘మిస్ యూనివర్స్ పాకిస్తాన్’ గా నిలిచింది. ఈ టైటిల్ కోసం ఇనామ్ (24), జెస్సికా విల్సన్ (28), మలికా అల్వీ (19), సబ్రినా వాసిమ్ (26) లు పోటీపడ్డారు.

ఎరికా రాబిన్ సెప్టెంబర్ 14, 1999 లో కరాచీలో ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. సెయింట్ పాట్రిక్స్ గర్ల్స్ హైస్కూల్‌లో పాఠశాల విద్య చదువుకుంది. చండీగఢ్‌లోని గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పూర్తి చేసింది. జనవరి 2020 లో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది. 2020 లోనే DIVA మ్యాగజైన్ పాకిస్తాన్ సంచికలో కనిపించింది. ఒకప్పటి మోడల్, నటి వనీజా అహ్మద్ దృష్టిలో పడి మోడలింగ్‌లోకి ప్రవేశించినట్లు ఎరికా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

Kashmir : అందాల కశ్మీరులోయలో మిస్ వరల్డ్, సుందరాంగుల పర్యటన

ఎరికా ఖాదీ, జరా షాజహాన్, సానియా మస్కతియా, ఎలాన్, సనా సఫినాజ్ వంటి పాకిస్తానీ ఫ్యాషన్ బ్రాండ్స్ షూట్స్, ఫ్యాషన్ షోలలో పాలు పంచుకుంది. ఆగస్టు 2020లో కరాచీలోని ఫ్లో డిజిటల్ అనే ఐటీ కన్సల్టింగ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసింది ఎరికా.  24 సంవత్సరాల వయసులో అందాల పోటీల్లో పాల్గొనేందుకు ఎరికా UAE, టర్కీ, మాల్దీవులతో సహా పలు దేశాల్లో పర్యటించింది. మొత్తానికి మిస్ యూనివర్స్ కిరీటాన్ని దక్కించుకున్న మొదటి పాకిస్తాన్ అమ్మాయిగా పేరు తెచ్చుకుంది ఎరికా రాబిన్.