Darwin Arch Collapse : కుప్పకూలిన రాతికట్టడం డార్విన్ ఆర్చ్

వైల్డ్ లైఫ్ లవర్స్‌కు ఎంతో సుపరిచితమైన టూరిస్ట్ స్పాట్.. ప్రసిద్ధ పర్యాటక రాతికట్టడం డార్విన్ ఆర్చ్ కుప్పకూలింది. దక్షిణ పసిఫిక్ సముద్రంలోని గాలా పోగోస్ ద్వీపకల్పంలో డార్విన్ ఆర్చ్ స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 11.20 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

Darwin Arch Collapse : కుప్పకూలిన రాతికట్టడం డార్విన్ ఆర్చ్

Famed Darwin’s Arch In Galapagos Islands Collapses Due To Erosion, Officials Say (1)

Updated On : May 19, 2021 / 2:21 PM IST

Famed Darwin’s Arch collapse Galapagos Island : వైల్డ్ లైఫ్ లవర్స్‌కు ఎంతో సుపరిచితమైన టూరిస్ట్ స్పాట్.. ప్రసిద్ధ పర్యాటక రాతికట్టడం డార్విన్ ఆర్చ్ కుప్పకూలింది. దక్షిణ పసిఫిక్ సముద్రంలోని గాలా పోగోస్ ద్వీపకల్పంలో డార్విన్ ఆర్చ్ సోమవారం స్థానిక కాలమానం ప్రకారం.. ఉదయం 11.20 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

ఈ మేరకు ఈక్వెడార్ పర్యాటక శాఖ అధికారులు వెల్లడించారు. సహజ సిద్ధమైన రాతికట్టడంగా పేరుగాంచిన ఈ డార్వాన్ ఆర్చ్ ఇప్పుడు ఆ శోభను కోల్పోయింది. మొన్నటివరకూ రెండు స్తంభాలతో ఆర్చ్ మాదిరిగా అలరించిన ఈ కట్టడం వెలవెలబోయినట్టుగా కనిపిస్తోంది.

తూర్పు ద్వీపానికి 600 మైళ్ల దూరంలో ఉన్న ఈ రాతికట్టడం డార్విన్ ఆర్చ్ కుప్పకూలిపోవడానికి సముద్రపు సహజ కోత కారణమని విశ్లేషకులు అంటున్నారు. కొన్ని వేల సంవత్సరాల అనంతరం ఈ రాతి కట్టడం నీటిలోకి జారిపోయింది.


ఈ కట్టడానికి జీవశాస్త్రజ్ఞుడు చార్లెస్‌ డార్విన్‌ పేరు మీదుగా డార్విన్‌ ఆర్చ్‌ అని పేరు పెట్టారు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో యునెస్కో ఈ కట్టడానికి చోటు కల్పించింది. అడ్వైంచర్స్‌, సాహసాలు చేసేవారికి టూరిస్ట్ స్పాట్.. ఫొటో షూట్‌లకు ప్రసిద్ధి చెందింది.