Blood Sea : 175 పైగా తిమింగలాలను పొట్టన పెట్టుకున్న వేటగాళ్లు..సముద్ర తీరం అంతా రక్త సిక్తం..
ఫారో దీవులలోని వేటగాళ్ళు 175 పైగా తిమింగలాలను పొట్టన పెట్టుకున్నారు. ఫ్రోస్లోని గ్రిన్‌డ్రాప్ లేదా గ్రైండ్ అని పిలిచే ద్వీపంలో వేటగాళ్లు హుక్స్, కత్తులు, స్పియర్స్‌తో విచక్షణారహితంగా తిమింగలాలపై దాడి చేసి చంపారు. దీంతో సముద్ర తీరమంతా రక్తసిక్తంగా మారిపోయింది.

Faroe Islands Hunters Slaughter Over 175 Pilot Whales
slaughter 175 pilot whales : మనిషి స్వార్థం, క్రూరత్వం మూగ జీవాల ప్రాణాలు తీస్తున్నాయి. కాసుల కోసం నరరూప రాక్షసుల్లా మారుతున్నారు మనుషులు. ఎన్నో మూగ జీవాలను అంతమొందిస్తున్న మనిషి మారణహోమాన్ని సృష్టిస్తున్నాడు. రక్తపిపాసిలా మారుతున్నాడు. ఫారో దీవుల్లో రక్తచరిత్ర సృష్టించాడు. తిమింగిలాలను ఊచకోత కోశారు కొంతమంది వేటగాళ్లు.175కు పైగా తిమింగిలాలను చంపేయటంతో సముద్ర తీరమంతా రక్త సిక్తంగా మారిపోయింది. ఆప్రాంతంలోని సముద్రపు నీరంతా రక్తంలా మారిపోయింది. ఎర్రటి రంగులో భీతిగొలుపుతున్నాయి ఫారో దీవులు.
మనిషి కంటే ముందే జంతువులు భూమి మీద జీవించాయని చరిత్ర చెబుతోంది. జంతువులు..ప్రాణుల కంటే వెనుక భూమ్మిద జీవితాన్ని మొదలు పెట్టిన మనిషి మాత్రం మిగతా అన్ని వాటికంటే అధికుడయ్యాడు. అన్నింటిమీద ఆదిపత్యం చెలాయించాలనే స్వార్థంతో మారణహోమాన్ని సృష్టిస్తూ..తనకు తానే చేటు తెచ్చుకుంటున్నాడు.
ఈ క్రమంలో ఫారో దీవులలోని వేటగాళ్ళు 175 పైగా తిమింగలాలను పొట్టన పెట్టుకున్నారు. ఫ్రోస్లోని గ్రిన్‌డ్రాప్ లేదా గ్రైండ్ అని పిలిచే ద్వీపంలో గత ఆదివారం (జూన్ 26,2021) 20 పడవల్లో వచ్చిన వేటగాళ్లు హుక్స్, కత్తులు, స్పియర్స్‌తో విచక్షణారహితంగా తిమింగలాలపై దాడి చేసి చంపారు. సముద్ర తీర ప్రాంతంలో ఓ చోట 52 పైలట్ తిమింగలాలను చంపగా.. మరో చోట 123 తిమింగలాలను చంపేశారు. దీంతో సముద్ర తీరం రక్త సిక్తంగా మారిపోయింది. ఇక్కడ ఇది కొత్తగా జరిగేది కాదు. గత 10ఏళ్లల్లో 6,500 పైగా తిమింగలాలు, డాల్ఫిన్‌లను పొట్టనపెట్టుకున్నారు వేటగాళ్లు. ఇదొక అనాగరకమైన చర్య అని సీ షెపర్డ్ తెలిపింది.
సీ షెపర్డ్ పరిరక్షణకారులు ఓ డ్రోన్‌ను పంపించగా తిమింగలాలు ఉండే ప్రాంతంలో ఆ డ్రోన్ వెళుతుండగా..ఈ ప్రాంతంలో జరిగిన ఘోరం సంగతి వెలుగులోకి వచ్చింది. సరిగ్గా డ్రోన్ వెళుతున్న సమయంలో తిమింగలాలను చంపే ఓ వ్యక్తి డ్రోన్‌పై షాట్‌గన్‌తో కాల్పులు జరిపాడు. తిమింగలం మాంసం చాలా మంది స్థానికులు తింటారు. అయితే ఈ విధంగా భారీగా హతమార్చడాన్ని భరించలేమని వాటి పరిరక్షకులు వాదిస్తున్నారు. దీనిపై ఫారో దీవుల్లోని వారు కొన్ని గ్రూపులుగా విడిపోయాయి.వారి సంస్కృతిని గౌరవించాలని అంటున్నారు కొంతమంది.