డిసెంబరులో వ్యాక్సిన్ రెడి

vaccine is expected by early December: కరోనా వైరస్ ను ఎదుర్కోటానికి తయారు చేసే వ్యాక్సిన్ ప్రభావ వంతంగా పని చేస్తోందో లేదో తెలుసుకోవాలంటే డిసెంబర్ నాటికి కానీ తెలియదని అమెరికా అంటు వ్యాధుల నిపుణుడు, కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ చెప్పారు.
అది ప్రభావవంతంగా పని చేస్తోందని తేలినప్పటికీ అప్పటికి తయారు చేసిన టీకా అందరికి వేయాలంటే వచ్చేఏడాది చివరినాటికీ కానీ లభ్యం కాకపోవచ్చని ఆయన అభిప్రాయ పడ్డారు.
ఒకన్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన జనాభాలో ఎక్కువ మందికి టీకా వేయటం వలన కరోనా వ్యాప్తి తగ్గు ముఖం పడుతుందని అన్నారు. కాకపోతే ఇది 2021 ఆగస్టు తర్వాత కానీ సాధ్యం కాకపోవచ్చని తెలిపారు.
https://10tv.in/coronavirus-patients-lungs-found-hard-as-a-leather-ball-in-autopsy/
డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ పనితీరు గుర్తించి , 2021 జనవరి నుంచి కొన్ని ప్రామాణికాలు పాటిస్తూ ప్రజలకి వేయటం మొదలెడితే అది ఆగస్టు నాటికి ప్రభావ వంతంగా పని చేస్తుందని డాక్టర్ ఆంథోనీ ఫౌసీ అన్నారు.