బ్రిటన్‌లో మాజీ సీఎం కొడుకు అనుమానాస్పద మృతి

  • Published By: veegamteam ,Published On : February 12, 2020 / 04:15 AM IST
బ్రిటన్‌లో మాజీ సీఎం కొడుకు అనుమానాస్పద మృతి

Updated On : February 12, 2020 / 4:15 AM IST

అరుణాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం కలిఖో పుల్ కుమారుడు శుబాన్సో (20) యూకేలోని ఓ అపార్ట్ మెంట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కలిఖో పుల్ కు శుబాన్సో మొదటి భార్య డాంగ్విమ్సాయ్ కొడుకు. అతను గత కొన్ని రోజులుగా యూకేలోని ఓ యూనివర్సిటీలో చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో బ్రైటన్‌లోని ఓ అపార్టుమెంట్‌లో శుబాన్సో మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది.   

శుబాన్సో మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావటానికి అతని కుటుంబ సభ్యులు యూకేలోని హైకమిషణ్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతున్నారు. కాగా.. అరుణాచల్‌ప్రదేశ్ సీఎగా కలిఖో పుల్ 2016లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు. 2016 ఆగస్టులో సీఎం అధికార బంగ్లాలో కలిఖోపుల్ ఆత్మహత్య చేసుకుని మరణించారు.  ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తరపున కలిఖోపుల్  అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎన్నికయ్యారు.