China : గుండెపోటుతో చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ మృతి
చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ గుండెపోటుతో కన్నుమూశారు. 68 ఏళ్ల వయస్సులో లీ గుండెపోటుకు గురై కన్నుమూశారు అని చైనా అధికార మీడియా వెల్లడించింది.

Former Chinse Premier Li Keqiang
China Former Premier Li Keqiang passed away : చైనా మాజీ ప్రధాని లీ కెకియాంగ్ గుండెపోటుతో కన్నుమూశారు. 68 ఏళ్ల వయస్సులో లీ గుండెపోటుకు గురై కన్నుమూశారు అని శుక్రవారం (అక్టోబర్ 27,2023) చైనా అధికార మీడియా వెల్లడించింది. సంస్కరణల ఆలోచనలు కలిగిన లీ బ్యూరోక్రాట్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అతని సంస్కరణల ఆలోచనలతో దేశానికి మంచి నాయకుడు అవుతాడని అప్పట్లోనే పలువురు భావించేవారట. ఆ అంచనాలను నిజం చేస్తు లీ పనిచేశారు. పదేళ్లపాటు అధ్యక్షుడు జిన్‌పింగ్ హయాంలోనే ప్రధాన మంత్రిగా పనిచేసి విశేష సేవలు అందించారు. తన ఆలోచనా విధానాలతో దేశానికి విశిష్ట సేవలందించిన నేతగా లీ పేరొందారు.
గురువారం గుండెపోటుకు గురైన లీని వెంటనే షాంఘైలోని ఓ ప్రముఖ ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. ఆ తరువాత ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారని చైనా అధికార మీడియా జిన్హువా వెల్లడించింది.
Most Languages Country : భారత్ కంటే ఎక్కువ భాషలు ఉన్న దేశం ఏదో తెలుసా..?
బ్యూరోక్రాట్ గా ఆయన ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడే సామర్థ్యం కలిగిన లీ పలు ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారు. ప్రధానిగా పనిచేస్తున్న సమయంలో తనతోటి వారితో పోల్చితే ఆధునిక వ్యక్తిగా గుర్తింపుపొందారు. పార్టీ పరిమితులను ఏమాత్రం దాటకుండాగానే మరోపక్క ఆర్థిక సంస్కరణల దిశగా పనిచేసేవారు. లీ పార్టీ అధినేతగా ఉన్న సమయంలో హెనాన్ ప్రావిన్స్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాప్తి చెందిన ఘటన ఆయన కెరీర్ లో పెద్ద అప్రతిష్టగా మారి కళంకంగా మిగిలిపోయింది. ఈ ఘటన ఆయన ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసింది.
లీ పెకింగ్ యూనివర్శిటీ నుంచి న్యాయ పట్టా పొందారు. చదువుకునే సమయంలోనే ఆయన పాశ్చాత్య,ఉదారవాద రాజకీయ సిద్ధాంతాల దిశగా పనిచేసేవారని తోటి విద్యార్దులు చెప్పేవారు. బ్రిటీష్ న్యాయమూర్తి చట్టాలపై రాసిన ఓ పుస్తకాన్ని లీ ట్రాన్స్ లేట్ చేశారు. తూర్పు చైనాలోని పేద అన్ హుయ్ ప్రావిన్స్ లో ఒక చిన్న పార్టీ నేత కుమారుడు లీ చైనా ప్రధాని స్థాయికి చేరుకుని పదేళ్లు పాలించారు. ఆ పాలన హయాంలో పలు ఆర్థిక సంస్కరణలు నాంది పలికారు.