Donald Trump: ట్రంప్ విజయంపై కీలక వ్యాఖ్యలు చేసిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంపై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా స్పందించాడు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఓ లేఖను పోస్టు చేశాడు.

Donald Trump and Barack Obama
Barack Obama: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన వచ్చే ఏడాది జనవరిలో రెండోసారి అగ్రరాజ్యం అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నాడు. ట్రంప్ విజయంతో భారతీయ అమెరికన్లు సంబురాలు చేసుకుంటున్నారు. ట్రంప్ ఎన్నికతో ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుందని, సరిహద్దు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని, తద్వారా ప్రపంచ శాంతి నెలకొటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ట్రంప్ విజయంపై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా స్పందించాడు. ఈ మేరకు ట్విటర్ ద్వారా ఓ లేఖను పోస్టు చేశాడు.
Also Read: Donald Trump: అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన భారతీయ అమెరికన్లు వీరే..
డొనాల్డ్ ట్రంప్ విజయం మేము ఆశించిన ఫలితం కాదని ఒరాక్ ఒబామా పేర్కొన్నాడు. కానీ, ప్రజాస్వామ్యంలో జీవించడం అంటే ఎల్లప్పుడూ మనమే గెలవం అని గుర్తించడం.. అందుకే శాంతియుతంగా అధికార మార్పిడికి సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ నకు ఒబామా శుభాకాంక్షలు తెలిపారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి కమల హారిస్, ఆమె రన్నింగ్ మేట్ టిమ్ వాజ్ లు గెలుపుకోసం శాయశక్తులా కృషి చేశారని మాజీ అధ్యక్షుడు ఒబామా ప్రశంసించాడు.
Here’s our statement on the results of the 2024 presidential election: pic.twitter.com/lDkNVQDvMn
— Barack Obama (@BarackObama) November 6, 2024