Plane Crash Four Killed : అమెరికాలో కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి

నేపాల్ విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలోని విమానం ప్రమాదం జరిగింది. టెక్సాస్ లోని చిన్న సైజు విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు.

Plane Crash Four Killed : అమెరికాలో కుప్పకూలిన విమానం.. నలుగురు మృతి

PLANE CRASH

Updated On : January 18, 2023 / 2:57 PM IST

Plane Crash Four Killed : నేపాల్ విమాన ప్రమాద ఘటన మరువకముందే మరో విమాన ప్రమాదం జరిగింది. అమెరికాలోని విమానం ప్రమాదం జరిగింది. టెక్సాస్ లోని చిన్న సైజు విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. విక్టోరియా యోకూమ్ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాద సమయంలో విమానంలో ఐదుగురు ప్రయాణికులు ఉన్నట్లు తెలిపారు. వీరిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతులు బిల్ గార్నర్, స్టీవ్ టక్కర్, టైలర్ ప్యాటర్సన్, టైలర్ స్ప్రంగర్ లుగా గుర్తించారు. ప్రమాదంలో గాయపడిన పాస్టర్ కెన్నన్ వాఘన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరందరూ జర్మన్ టౌన్ లోని మెంఫిస్ శివారులోని ఓ చర్చికి చెందిన వారుగా అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.

Nepal Plane Crash : నేపాల్ విమాన ప్రమాదంలో గుండెలు పిండే మరో విషాదం.. టిక్ టాక్ వీడియో చేసిన కాసేపటికే దుర్మరణం

జనవరి 15 ఆదివారం నేపాల్ లో ఎతి ఎయిర్ లైన్స్ కు చెందిన ఏటీఆర్-72 విమానం ప్రమాదానికి గురైంది. పోఖ్రా అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌ వేపై విమానం కుప్పకూలింది. మంటలు చెలరేగడంతో 68 మంది చనిపోయారు. మృతుల్లో అధిక మంది నేపాల్ కు చెందిన వారే ఉండటం గమనార్హం. మృతుల్లో రష్యా, కొరియా, ఐర్లాండ్, ఫ్రాన్స్ దేశస్తులు కూడా ఉన్నారు. రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడం వల్లనే ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాద సమయంలో విమానంలో 68 మంది ప్రయాణికులు, నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు.