G7 warns Russia: రసాయన, జీవ, అణ్వాయుధాలను వాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి: రష్యాకు జీ7 దేశాల హెచ్చరిక

‘‘ఉక్రెయిన్ పై ఉద్దేశపూర్వకంగా రష్యా పాల్పడుతున్న చర్యలపై మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. పాక్షిక సైనిక సమీకరణ, బాధ్యతారహితంగా అణ్వాయుధాల గురించి చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రపంచ శాంతి, భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మేము మరోసారి చెబుతున్నాం.. రసాయన, జీవ, అణ్వాయుధాలను రష్యా వాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి’’ అని జీ7 దేశాలు చెప్పాయని శ్వేతసౌధం పేర్కొంది.

G7 warns Russia: రసాయన, జీవ, అణ్వాయుధాలను వాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి: రష్యాకు జీ7 దేశాల హెచ్చరిక

Updated On : October 12, 2022 / 12:10 PM IST

G7 warns Russia: ఉక్రెయిన్ పై రష్యా దాడులను మళ్ళీ తీవ్రతరం చేసిన వేళ రష్యాకు జీ7 (యూకే, జర్మనీ, ఇటలీ, కెనడా, అమెరికా, ఫ్రాన్స్, జపాన్) దేశాలు ఓ హెచ్చరిక జారీ చేశాయి. ఒకవేళ ఉక్రెయిన్ పై అణ్వాయుధాలతో దాడి చేస్తే రష్యా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని హెచ్చరించాయి. అలాగే, ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులను ఖండిస్తున్నట్లు జీ7 దేశాలు తెలిపాయి. ఈ విషయాన్ని తెలుపుతూ శ్వేతసౌధం ఓ ప్రకటన చేసింది.

‘‘ఉక్రెయిన్ పై ఉద్దేశపూర్వకంగా రష్యా పాల్పడుతున్న చర్యలపై మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. పాక్షిక సైనిక సమీకరణ, బాధ్యతారహితంగా అణ్వాయుధాల గురించి చేస్తున్న వ్యాఖ్యల వల్ల ప్రపంచ శాంతి, భద్రతలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మేము మరోసారి చెబుతున్నాం.. రసాయన, జీవ, అణ్వాయుధాలను రష్యా వాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి’’ అని జీ7 దేశాలు చెప్పాయని శ్వేతసౌధం పేర్కొంది.

తాజాగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా చేసిన క్షిపణి దాడులను పలు దేశాలు ఖండించాయి. దీంతో ఈ అంశంపై జీ7 దేశాలు ప్రధానంగా చర్చించాయి. ఉక్రెయిన్ సరిహద్దులను మార్చేందుకు తాము అవకాశం ఇవ్వబోమని జీ7 దేశాలు చెప్పాయని శ్వేతసౌధం పేర్కొంది. అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించేలా రష్యా వ్యవహరిస్తోందని చెప్పాయని తెలిపింది. ఉక్రెయిన్ నుంచి సైనికులను, యుద్ధ సామగ్రిని వెనక్కి రప్పించాలని రష్యాను జీ7 దేశాలు డిమాండ్ చేశామని శ్వేతసౌధం పేర్కొంది.

10 TV live:  10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..