చెత్తబుట్టలో రూ. 2.80 కోట్ల పెయింటింగ్

  • Published By: madhu ,Published On : December 13, 2020 / 10:26 AM IST
చెత్తబుట్టలో రూ. 2.80 కోట్ల పెయింటింగ్

Updated On : December 13, 2020 / 11:03 AM IST

German police rescue €280,000 painting : ఒకటి కాదు..రెండు కాదు..రూ. 2.80 కోట్ల పెయింటింగ్ చెత్తబుట్టలో దర్శనమిచ్చింది. ఇదేదో పనికిరాని వస్తువు అంటూ..చెత్తబుట్టలో పారివేయడం..దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. ఓ బిజినెస్ మెన్ జర్మనీ నుంచి ఇజ్రాయిల్ కు వెళ్లాలని అనుకున్నాడు. నవంబర్ నెలాఖరులో డ్యూ సెల్డార్ఫ్ విమానాశ్రయానికి తన సామాగ్రీతో చేరుకున్నాడు. చెకింగ్ కౌంటర్ వద్ద..వస్తువులను తనిఖీ చేసిన అనంతరం విమానంలోకి వెళ్లి కూర్చొన్నాడు.

French surrealist

విమానం గాల్లోకి లేచిన తర్వాత..అసలు విషయం గుర్తుకు వచ్చింది. తాను తీసుకొచ్చిన రూ. 2.80 కోట్లు విలువైన పేయిటింగ్ ($340,000) French surrealist Yves Tanguy మర్చిపోయిన సంగతి గుర్తుకొచ్చింది. ఇజ్రాయిల్ లో దిగిన అనంతరం Düsseldorfలో (western German city) సంప్రదించడానికి ఆ బిజినెస్ మెన్ ప్రయత్నించాడు. 40 x 60 సెంటిమీటర్లు, 16 X 24 ఇంచ్‌లున్న పెయింటింగ్ విషయాన్ని ఈమెయిల్‌ల ద్వారా పంపించాడు. ఆలస్యం అయితే..కష్టమని భావించిన అతను..బెల్జియంలో ఉన్న తన బంధువుకు తెలిపాడు. జర్మనీ వెళ్లి..డ్యూ సెల్డార్ఫ్ విమనాశ్రయం సిబ్బందికి తెలియచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. Michael Dietz (inspector) క్లీనింగ్ కంపెనీని సంప్రదించారు. ఓ చెత్తబుట్టలో ఆ పెయింటింగ్ దర్శనమిచ్చింది. అదృష్టవశాత్తు దానికి ఏం కాలేదు. దీనిని ఎట్టకేలకు ఆ బిజినెస్‌మెన్‌కు పెయింటింగ్ ను పంపించారు.