అదను చూసి : బంగారు టాయిలెట్ ను ఎత్తుకెళ్లారు
అసలే బంగారం ధర మండిపోతోంది. తులం బంగారం రూ.40వేలు ఉంది. ఎంత పసిడి ఉంటే అంత సంపన్నులుగా గుర్తిస్తారు. బంగారం అంటే ఇష్టపడని వారు ప్రపంచంలో ఉండరు. గోల్డ్

అసలే బంగారం ధర మండిపోతోంది. తులం బంగారం రూ.40వేలు ఉంది. ఎంత పసిడి ఉంటే అంత సంపన్నులుగా గుర్తిస్తారు. బంగారం అంటే ఇష్టపడని వారు ప్రపంచంలో ఉండరు. గోల్డ్
అసలే బంగారం ధర మండిపోతోంది. తులం బంగారం రూ.40వేలు ఉంది. ఎంత పసిడి ఉంటే అంత సంపన్నులుగా గుర్తిస్తారు. బంగారం అంటే ఇష్టపడని వారు ప్రపంచంలో ఉండరు. గోల్డ్ కి ఉన్నంత డిమాండ్ మరోదానికి లేదని చెప్పొచ్చు. అలాంటి గోల్డ్ కోసం దొంగలు ఎంతకైనా తెగిస్తారు. బంగారం దోచుకుని అమ్ముకుంటే బాగా డబ్బులు వస్తాయని ఆశపడతారు. వివరాల్లోకి వెళితే.. గోల్డ్ టాయిలెట్ చోరీ అయ్యింది. అసలే బంగారంతో చేసింది.. ఇక ఊరుకుంటారా.. దొంగలు తమ చేతులకు పని చెప్పారు. అదను చూసి ఎత్తుకెళ్లిపోయారు.
అచ్చంగా 18 కేరట్ల బంగారంతో చేసిన మరుగుదొడ్డి అది. లండన్ లోని బ్లనియమ్ ప్యాలెస్ లోని ప్రదర్శనశాలలో దీన్ని శనివారం(సెప్టెంబర్ 14,2019) దొంగలు చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. దీని విలువ రూ.8.8 కోట్లు ఉండొచ్చని చెప్పారు. న్యూయార్క్ లోని సోలోమన్ ఆర్ గుగెన్ హైమ్ ప్రదర్శనశాల నుంచి రెండు రోజుల క్రితమే దీనిని లండన్ తీసుకొచ్చారు. అక్టోబర్ 27 వరకు ఈ కళాఖండాన్ని బ్లనియమ్ ప్రదర్శనశాలలో ఉంచాలని నిర్వాహకులు భావించారు. ఇంతలోనే దొంగలు ఎత్తుకుపోవడంతో షాక్ తిన్నారు. ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దొంగలను పట్టుకునే పనిలో పడ్డారు.
ఇటలీకి చెందిన మౌరిజియో కాటెలన్ దీనిని రూపొందించారు. అర్ధరాత్రి దుండగులు ప్యాలెస్‌లోకి ప్రవేశించి చోరీకి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. దొంగతనానికి రెండు వాహనాలను వాడారని తేల్చారు. త్వరలోనే దొంగలను పట్టుకుంటామని చెప్పారు. దొంగతనం కావడంతో అధికారులు ప్యాలెస్‌ను మూసివేశారు. పర్యాటకులను లోనికి అనుమతించలేదు. అమెరికాలోని న్యూయార్క్‌లో సాలమన్ గుగ్గెన్ హీవ్ మ్యూజియంలో ఇటీవలే ఈ టాయిలెట్‌ను ప్రదర్శించారు. బంగారు మరుగుదొడ్డి దొంగతనం వార్త స్థానికంగా కలకలం రేపింది.