Hindu Temples In Bangladesh : బంగ్లాదేశ్ లో హిందూ ఆలయాలపై దాడులు..ముగ్గురు మృతి
దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులకు తెగబడ్డారు దుండగులు. కూమిల్లా,చాంద్పుర్, ఛత్తోగ్రామ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు

Bangladesh
Hindu Temples In Bangladesh దసరా వేడుకల వేళ బంగ్లాదేశ్లో హిందూ దేవాలయాలపై దాడులకు తెగబడ్డారు దుండగులు. కూమిల్లా,చాంద్పుర్, ఛత్తోగ్రామ్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో హిందూ దేవాలయాలను ధ్వంసం చేశారు దుండగులు. ఆలయాలపై దాడుల నేపథ్యంలో బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున అలర్లు చెలరేగాయి.
కూమిల్లా నగరంలోని స్థానిక ఆలయాన్ని ధ్వంసం చేశారనే వార్తలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. ఫలితంగా ఆ ప్రాంతంలో నిరసనలు చెలరేగడం వల్ల ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.
ఒకానొక సమయంలో పరిస్థితి చేయి దాటి పోయి దుర్గా పూజ జరిగే అనేక ప్రాంతాలకు అల్లర్లు విస్తరించాయి. అల్లర్లలో గురువారం ముగ్గురు చనిపోగా..అనేక మంది గాయపడ్డారు. పరిస్థితిని అదుపు చేసేందుకు 22 జిల్లాల్లో..బంగ్లాదేశ్ పోలీస్, ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్,సరిహద్దు దళాలను రంగంలోకి దించింది ప్రభుత్వం.
ALSO READ జపాన్ కొత్త ప్రధాని సంచలన నిర్ణయం..పార్లమెంట్ రద్దు