Greece Fires Cities : కార్చిచ్చులో కాలిపోతున్న గ్రీస్..నిరాశ్రయులైన వేలాది కుటుంబాలు
గ్రీస్ దేశం.. కార్చిచ్చులో కాలిపోతోంది. అగ్నికి వాయువు తోడైనట్లుగా అగ్ని కీలలకు పెనుగాలులు తోడవ్వటంతో మంటలు ఏమాత్రం అదుపులోకి రావటంలేదు. వేలాది కుటుంబాలు నిరాశ్రయులు కావటంతో దిక్కుతోచక అల్లాడుతున్నాయి. గ్రీస్ కు సహాయం చేయటానికి పలుదేశాలు ముందుకొచ్చాయి.

Greece Fires Cities
Greece Fires Cities : కార్చిచ్చులో గ్రీస్ దేశం మండిపోతోంది. వేలాది కుటుంబాలకు చెందిన ప్రజలు నిరాశ్రయులయ్యారు. దిక్కు తోచక అల్లాడిపోతున్నారు. నగరాలకు నగరాలే అల్లాడిపోతున్నాయి. కార్చిచ్చు మంటల్ని ఆర్పటానికి అధికారులు ఎన్ని యత్నాలు చేసినా మంటలు ఏమాత్రం అదుపులోకి రావటంలేదు. అంతకంతకు ఎగసిపడుతున్నాయి. అగ్నికి వాయువు తోడైంది అన్నట్లుగా ఉంది గ్రీస్ దేశపు పరిస్థితి. కార్చిచ్చు మంటలకు తోడు పెనుగాలులు విరుచుకుపడుతుంటంతో మంటలు ఎగసిపడుతున్నాయి.
మంటలను అదుపులోకి తీసుకురావటానికి ఎంతగానో శ్రమిస్తున్నారు. దీంట్లో భాగంగా..సుమారు 1500 గ్రీస్ ఫైర్ ఫైటర్లు, 15 విమానాలు, హెలికాఫ్టర్లు మంటలను ఆర్పడానికి తీవ్రంగా యత్నిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారీ వర్షాలు పడుతున్నా..మంటలు ఏమాత్రం తగ్గకపోవటం గమనించాల్సిన విషయం. అగ్ని కీలల ధాటికి గ్రీస్ దేశం కకావికలమైపోతోంది.
గ్రీస్ దేశపు పరిస్థిని అర్థం చేసుకున్న పలు దేశాలు సహాయం చేయటానికి ముందుకొచ్చారు. దీంట్లో భాగంగా బ్రిటన్ నుంచి అత్యంత అనుభవజ్ఞులైన ఫైర్ ఫైటర్లను పంపుతున్నామని బ్రిటన్ విదేశాంగ మంత్రి ప్రీతీ పటేల్ తెలిపారు. గ్రీస్ కు ఇంతటి ఘోర విపత్తు ఎప్పుడూ రాలేదని గ్రీస్ కు సహాయం చేయటానికి..అండగా మేమున్నామని భరోసా ఇచ్చారు.
శనివారం (ఆగస్టు 7,2021) మంటలకు పెనుగాలులు కూడా తోడవ్వటంతో పరిస్థితి భయంకరంగా తయారైంది. 100 డిగ్రీల ఫారెన్ హీట్ నమోదైనట్టు గ్రీస్ వాతావరణ శాఖ వెల్లడించింది. బ్రిటన్ తో బాటు ఫ్రాన్స్, ఈజిప్ట్ దేశాలు కూడా గ్రీస్ కు సహాయాన్ని ప్రకటించాయి. గత 10 రోజుల్లో 57 వేల హెక్టార్లు అగ్నికి ఆహుతైనట్టు యూరోపియన్ ఫారిన్ ఫైర్ ఇన్ఫర్మేషన్ సిస్టం తెలిపింది.
2008-2020 మధ్య కాలంలో ఇలాంటి విపత్తుకు 1700 హెక్టార్లు ఆహుతయ్యాయని తెలిపింది. భారీ ఆస్తి నష్టం జరిగిందని గ్రీస్ ప్రధాని మిసోతకీస్ చెప్పారు. ప్రాణ నష్టం అంతగా లేకపోయినా ఈ విపత్తు కలిగించిన ఘోర నష్టం నుంచి మా దేశం ఇప్పుడిప్పుడే కోలుకును పరిస్థితి లేదన్నారు. గ్రీస్ దేశ పరిస్థితి ఇలా ఉంటే మరో వైపు టర్కీ కూడా మంటలకు అల్లాడుతోంది. గత వారం రోజుల్లో 8 మంది మరణించగా పలు ప్రాంతాల్లో..అగ్నికీలలకు భవనాలు ఆహుతయ్యాయి. టర్కీలో కూడా భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.