Plane Crashes : గ్రీస్ కార్చిచ్చు ఆర్పటానికి వచ్చిన విమానం కూలి ఇద్దరు పైలెట్ల మృతి

గ్రీస్ అడవుల్లో రాజుకున్న కార్చిచ్చును ఆర్పటానికి వచ్చిన అగ్నిమాపక విమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలెట్లు మరణించారు. గ్రీస్ దీవి ఎవియాలో అడవిలో రాజుకున్న మంటలను ఆర్పుతున్న విమానం కూలిపోవడంతో ఇద్దరు గ్రీకు వైమానిక దళ పైలట్లు మరణించినట్లు అధికారులు తెలిపారు....

Plane Crashes : గ్రీస్ కార్చిచ్చు ఆర్పటానికి వచ్చిన విమానం కూలి ఇద్దరు పైలెట్ల మృతి

Plane Crashes

Updated On : July 26, 2023 / 6:11 AM IST

Plane Crashes : గ్రీస్ అడవుల్లో రాజుకున్న కార్చిచ్చును ఆర్పటానికి వచ్చిన అగ్నిమాపక విమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలెట్లు మరణించారు. గ్రీస్ దీవి ఎవియాలో అడవిలో రాజుకున్న మంటలను ఆర్పుతున్న విమానం కూలిపోవడంతో ఇద్దరు గ్రీకు వైమానిక దళ పైలట్లు మరణించినట్లు అధికారులు తెలిపారు. (Greece wildfires) ప్లాటానిస్టోస్ సమీపంలో అడవి ప్రాంతంలో వాటర్ బాంబింగ్ విమానం కూలిపోయిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Manipur : మణిపూర్‌లో వెలుగులోకి మరో దారుణం.. సూపర్ మార్కెట్‌లో గన్‌తో మహిళను

ఈ ప్రమాదంలో మరణించిన వారిలో సీడీఆర్ క్రిస్టోస్ మౌలాస్,అతని కో-పైలట్ పెరికల్స్ స్టెఫానిడిస్ లు ఉన్నారు. (Two pilots die) కెనడైర్ విమానం అడవిలో మంటలను ఆర్పటానికి తక్కువ ఎత్తులో ఎగురుతూ నీటిని వదులుతుండగా ప్రమాదానికి గురైంది. firefighting plane crashes) మంటలు చెలరేగుతున్న ద్వీపంలోని కరిస్టోస్ పట్టణంపై విమానం కూలిపోయిందని అధికారులు చెప్పారు. గ్రీకు ద్వీపమైన క్రీట్‌లో అగ్నిప్రమాదం సంభవించే ప్రమాదం ఉందని నివాసితులు హెచ్చరించడంతో హై అలర్ట్ ప్రకటించారు.