Hamas BIG WARNING : భూ దండయాత్రకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్‌కు హమాస్ హెచ్చరిక
గాజాకు చెందిన హమాస్ మళ్లీ మంగళవారం హెచ్చరిక జారీ చేసింది. భూ దండయాత్రకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్‌కు హమాస్ హెచ్చరిక జారీ చేసింది....

Hamas BIG WARNING
Hamas BIG WARNING : గాజాకు చెందిన హమాస్ మళ్లీ మంగళవారం హెచ్చరిక జారీ చేసింది. భూ దండయాత్రకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్‌కు హమాస్ హెచ్చరిక జారీ చేసింది. దిగ్బంధించిన గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ భూ దండయాత్ర చేసే ముప్పు పొంచి ఉన్నందున హమాస్ మిలటరీ విభాగం ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్స్ అధికార ప్రతినిధి అబూ ఒబెదేహ్ పెద్ద హెచ్చరిక జారీ చేశారు. ‘‘ఇజ్రాయెల్ భూతల దాడి ముప్పు తమను అడ్డుకోలేదని, ఈ దాడి మమ్మల్ని భయపెట్టదని, దాన్ని ఎదుర్కొవడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని అబూ ఒబెదేహ్ టెలివిజన్ ప్రసంగంలో పేర్కొన్నారు.
Also Read : Sundar Pichai thanks PM Modi : ప్రధాని మోదీతో సుందర్ పిచాయ్ భేటీ…ఏం చర్చించారంటే…
అక్టోబర్ 7వతేదీన ఇజ్రాయెల్ దక్షిణాన భారీ దాడి జరిగినప్పటి నుంచి ఎజ్జెడిన్ అల్-కస్సామ్ బ్రిగేడ్లు ప్రస్తుతం 200 మందిని బందీలుగా ఉంచుకున్నాయని అబూ ఒబీడే చెప్పారు. గాజాలో బందీలుగా ఉన్న 199 మంది వ్యక్తులను పరిస్థితులు అనుకూలించినప్పుడు విడుదల చేస్తామని అబూ ఒబీదే ఉద్ఘాటించారు. ఇజ్రాయెల్ వైమానిక దాడులను కూడా ఆయన ఖండించాడు. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 22 మంది బందీలు మరణించారని ఆయన వెల్లడించారు.
హిజ్బుల్లా లక్ష్యాలపై వైమానిక దాడులు
ఇజ్రాయెల్ లెబనాన్‌లోని హిజ్బుల్లా లక్ష్యాలపై వైమానిక దాడులను ప్రారంభించింది. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ బుధవారం ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నట్టు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు హమాస్ సైనిక, ప్రభుత్వ సామర్థ్యాలను నిర్వీర్యం చేయాలనే ఇజ్రాయెల్ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.
Also Read : Pune Accident : పూణేలో ఘోర రోడ్డు ప్రమాదం…నలుగురి మృతి, ఇద్దరికి గాయాలు
అక్టోబరు 7వతేదీ నుంచి ఇజ్రాయెల్‌లో 1,400 కంటే ఎక్కువ మంది మరణించారు. గాజాలో 2,750 మంది మరణించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. కాగా ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం ఆగడం లేదని ఆ దేశ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు చెప్పారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో నెతన్యాహు యుద్ధంపై పెద్ద ప్రకటన చేశారు. గాజాలో ఆపరేషన్ హమాస్ కింద భూతల దాడి ప్రారంభం కానుందని నెతన్యాహు పేర్కొన్నారు.