Corona vaccination : వ్యాక్సిన్‌ల వినియోగం ధ‌నిక దేశాల్లోనే ఎక్కువ‌..పేద దేశాల్లో ప‌రిస్థితి దారుణంగా ఉంది : WHO

అభివృద్ధి చెందిన దేశాలు త‌మ ద‌గ్గ‌రున్న మెరుగైన వైద్య స‌దుపాయాల‌తో  కరోనా మ‌హ‌మ్మారిని కొంత‌వ‌ర‌కు వేగంగా క‌ట్ట‌డి చేయ‌గులుగుతున్నాయి. కానీ పేద దేశాలు మాత్రం ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌లేక విల‌విల్లాడిపోతున్నాయి. తమ దేశ ప్రజలకు కనీస సౌకర్యాలు గానీ..టీకాలు గానీ అందించలేకపోతున్నాయని సాక్షాత్తూ స్వ‌యంగా డ‌బ్ల్యూహెచ్‌వో గ‌ణాంకాలే ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

Corona vaccination : వ్యాక్సిన్‌ల వినియోగం ధ‌నిక దేశాల్లోనే ఎక్కువ‌..పేద దేశాల్లో ప‌రిస్థితి దారుణంగా ఉంది : WHO

Corona Vaccination Process In Poor, Rich Countries (1)

Updated On : May 11, 2021 / 12:15 PM IST

Corona vaccination process in poor, rich countries : రోగుమొస్తే డబ్బులున్నవాడు వైద్యం చేయించుకుంటాడు. పేదవాడు బలైపోతాడు. అనే చందంగా ఉంది నేటి కరోనా పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ పరిస్థితి. తమ ప్రజలకు కరోనా టీకాలు వేయించటంలో ధనిక దేశాలు ముందున్నాయి. కానీ పేద దేశాలు మాత్రం బిక్కు బిక్కుమంటున్నాయి. ప్ర‌పంచ దేశాల‌ను కరోనా మహమ్మారి ప‌ట్టిపీడిస్తున్న‌ సంగంతి ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అన్ని దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

ఈ క్రమంలో అభివృద్ధి చెందిన దేశాలు త‌మ ద‌గ్గ‌రున్న మెరుగైన వైద్య స‌దుపాయాల‌తో  కరోనా మ‌హ‌మ్మారిని కొంత‌వ‌ర‌కు వేగంగా క‌ట్ట‌డి చేయ‌గులుగుతున్నాయి. కానీ పేద దేశాలు మాత్రం ఈ వైర‌స్‌ను క‌ట్ట‌డి చేయ‌లేక విల‌విల్లాడిపోతున్నాయి. తమ దేశ ప్రజలకు కనీస సౌకర్యాలు గానీ..టీకాలు గానీ అందించలేకపోతున్నాయని సాక్షాత్తూ స్వ‌యంగా డ‌బ్ల్యూహెచ్‌వో గ‌ణాంకాలే ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

పేద దేశాల్లో ప‌రిస్థితి ఇంత దారుణంగా ఉన్న‌ప్ప‌టికీ.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అమ‌ల్లోకి వ‌చ్చిన వ్యాక్సిన్‌ల వినియోగంలో ధ‌నిక దేశాలే ముందున్నాయని తెలిపింది. స్వ‌యంగా డ‌బ్ల్యూహెచ్‌వో గ‌ణాంకాలే ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తున్నాయి. ప్ర‌పంచంలో ధ‌నిక, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి దేశాల జ‌నాభా 53 శాతం ఉండ‌గా.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లో 83 శాతాన్ని ఆ దేశాలే వినియోగించాయ‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. ఇక పేద‌, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి దేశాల జ‌నాభా ప్ర‌పంచ జ‌నాభాలో 47 శాతం ఉందని, కానీ ఆయా దేశాల్లో వ్యాక్సిన్ వినియోగం కేవ‌లం 17 శాతం మాత్ర‌మే ఉంద‌ని WHO చీఫ్ టెడ్రోస్ అధ‌నోమ్ గెబ్రియేస్ వెల్లడించారు.