Sean Penn : యుక్రెయిన్‌లో హాలీవుడ్ హీరో షూటింగ్.. నడుచుకుంటూ ఇలా బోర్డర్ దాటేశాడు..!
Sean Penn : హాలీవుడ్ హీరో యుక్రెయిన్‌లో షూటింగ్‌కు వెళ్లాడు. అది కూడా యుక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు సంబంధించి డాక్యుమెంటరీ తీసేందుకు వెళ్లాడట.

Hollywood Star Sean Penn Leaves Ukraine On Foot, ‘walks Miles’ To Reach Polish Border
Sean Penn : యుక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఓ హాలీవుడ్ హీరో యుక్రెయిన్‌లో షూటింగ్‌కు వెళ్లాడు. అది కూడా యుక్రెయిన్‌పై రష్యా దురాక్రమణకు సంబంధించి డాక్యుమెంటరీ తీసేందుకు వెళ్లాడట. డాక్యుమెంటరీ తర్వాతి సంగతి.. ఈ యుద్ధ సమయంలో యుక్రెయిన్ నుంచి బయటపడితే చాలు అనుకున్నాడేమో.. 61ఏళ్ల సీన్ పెన్ ఇలా రోడ్డుపై నడుచుకుంటూనే సరిహద్దు దాటేశాడు.
ఆస్కార్ విన్నర్ అయిన సీన్ పెన్.. తన కారును అక్కడే వదిలేసి.. కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కాలినడకనే ప్రయాణం కొనసాగించారట.. రష్యా సేనలు కీవ్ నగరాన్ని ఆక్రమించేందుకు వరుస దాడులతో విరుచుకుపడుతున్న క్రమంలో యుక్రెయిన్ సరిహద్దుల నుంచి సాధ్యమైనంత తొందరగా బయటపడాలనుకున్నాడు.
వెంటనే తన బ్యాక్ ప్యాక్, లగేజీతో పోలాండ్ సరిహద్దు దిశగా బయల్దేరాడు. మార్గం మధ్యలో ట్రాఫిక్ జామ్ కావడంతో కారును అక్కడే వదిలేసి ఇలా కాలినడకన వెళ్లాడు. అదృష్టవశాత్తూ హాలీవుడ్ హీరో సీన్ కీన్.. క్షేమంగా యుక్రెయిన్ సరిహద్దు దాటేసినట్టు ఆయన ఫాలోవర్లు వెల్లడించారు. హాలీవుడ్ హీరోగా సీన్ కీన్.. అనేక సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
Ukraine is the tip of the spear for the democratic embrace of dreams. If we allow it to fight alone, our soul as America is lost. (2/2)
— Sean Penn (@SeanPenn) February 26, 2022
సీన్ కీన్ నటించిన చాలా సినిమాల్లో మిస్టిక్ రివర్, మిల్క్ సీన్ పెన్‌కు ఆస్కార్ అవార్డులను తెచ్చిపెట్టాయి. ఇన్ టు ద వైల్డ్, ద క్రాసింగ్ గార్డ్ మూవీలకు సీన్ కీన్ డైరెక్ట్ చేశారు కూడా. ఓ నివేదిక ప్రకారం.. గత నవంబర్‌లో సీన్ కీన్ యుక్రెయిన్ లో డాక్యుమెంటరీ తీసేందుకు వచ్చాడు. అక్కడి యుక్రెయిన్ మిలటరీని కూడా సంప్రదించాడు. ఆ సమయంలో యుక్రెయిన్ ఉపాధక్ష్యుడు Iryna Vereshchuk తో కూడా తన డాక్యుమెంటరీ విషయమై ప్రస్తావించారు.
Read Also : Iranian People : యుక్రెయిన్-రష్యా వార్.. బైడెన్ టంగ్ స్లిప్.. ట్రెండింగ్‌లో #ఇరానియన్.. హ్యాష్ ట్యాగ్!