అకస్మాత్తుగా పెద్ద అల…చీమలా కొట్టుకుపోయాడు

సరదాగా గడుపుదామని బీచ్ కి వెళ్లిన ఓ యువకుడుకి సెకన్ల గ్యాప్ లో ఊహించని పరిణామం ఎదురైంది. కంటి రెప్ప ఆర్పేలోపు ఓ పెద్ద అల మృత్యువు రూపంలో ఆ యువకుడిని మింగేసేందుకు ప్రయత్నించింది. ఓ పెద్ద అల వచ్చి పైన పడటంతో ఆ యువకుడు విసిరేసినట్లు అల్లంత దూరంలో పడిపోయాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
డిసెంబర్-20,2019న కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాంటా క్రజ్ లోని బొన్ని డూన్ బీచ్ కి ఓ 20ఏళ్ల యువకుడు సరదాగా గడుపుదామని వెళ్లాడు. సముద్రం దగ్గరే ఉన్న ఓ పెద్ద బండరాయి పైకి ఎక్కి సముద్రపు గాలిని ఆశ్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇంతలో అకశ్మాత్తుగా వేగంగా వచ్చిన అల పైన పడి రాయి పైనుంచి సముద్రంలోకి పడిపోయాడు యువకుడు.
అయితే అదృష్టవశాత్తూ కాల్ ఫైర్,కాలిఫోర్నియా స్టేట్ పార్క్స్ రేంజర్స్ అలర్ట్ అయి ఆ యువకుడిని ప్రాణాలతో బయటకు తీసుకురాగలిగారు. ఈ ఘటనకు సంబంధించిన తొమ్మిది సెకన్ల వీడియో క్లిప్ నెటిజన్లు షాక్ కు గురిచేసింది. ప్రస్తుతం యువకుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు సమాచారం. శాంతా క్రజ్ కౌంటీ ఫేస్ బుక్ లో ఈ వీడియోను షేర్ చేస్తూ… పెద్ద అలలు వచ్చే అవకాశముందని,టూరిస్టులు అలర్ట్ గా ఉండాలని,సుముద్రం వైపు తిరగకండని ఓ అలర్ట్ మ మెసేజ్ కూడా ఇచ్చింది.