వింటేనే వణుకు : ఒకే ఇంట్లో గుట్టలుగా రాటిల్ స్నేక్స్

  • Published By: veegamteam ,Published On : March 21, 2019 / 08:56 AM IST
వింటేనే వణుకు : ఒకే ఇంట్లో గుట్టలుగా రాటిల్ స్నేక్స్

Updated On : March 21, 2019 / 8:56 AM IST

హూస్టన్: పాములు..పాములే పాములు..ఇంటికిందే కాపురం పెట్టేశాయి. ఒకటీ రెండూ కాదు ఏకంగా పదులకొద్దీ పాములు ఆ ఇంటి యజమానికి దడ పుట్టించాయి. పాముల కొంపా అన్నట్లుగా తయారయ్యింది ఆ ఇంటి పరిస్థితి. అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం అల్బానీలో ఉండే ఓ ఇంటి యజమానికి ఇదే అనుభవం ఎదురైంది. 

ఓ కేబుల్ కోసం వెతికుతున్న క్రమంలో కేబుల్ మాట ఎలా ఉన్నా పాములు కనిపించేసరికి హడలిపోయాడు దీంతో భయపడి బిగ్ కంట్రీ స్నేక్ రిమూవల్‌కు ఫోన్ చేశాడు. వాళ్లు వచ్చి చూస్తే.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 45 రాటిల్ స్నేక్స్ అక్కడ కనిపించాయి. వాటిని ఒక్కొక్కొటిగా బయటకు తీసి.. చివరికి అన్నింటినీ  ఓ అడవిలో విడిచిపెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను బిగ్ కంట్రీ స్నేక్ సంస్థ ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. అదికాస్తా వైరల్ గా మారి 11 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. రాటిల్ స్నేక్ ఎంతో ప్రమాదకరమైన పాము. కాగా గతంలో ఇదే టెక్సాస్ రాష్ట్రంలో మరో వ్యక్తికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన షెడ్‌లో అతను ఏకంగా 30 రాటెల్ స్నేక్స్ కనిపించాయి.