చిన్న ఉచ్చుకు చిక్కుకున్న పెద్ద పాము: కనిపించేదంతా నిజం కాదు

చిన్న ఉచ్చుకు చిక్కుకున్న పెద్ద పాము:  కనిపించేదంతా నిజం కాదు

Updated On : November 22, 2020 / 2:45 PM IST

SNAKE: రీసెంట్ గా ఓ వీడియో ఆన్‍‌లైన్లో చక్కర్లు కొడుతుంది. అనకొండ సైజులో ఉన్న పాము కోడిని తినడానికి వచ్చి ట్రాప్ లో పడినట్లు అందులో ఉంది. దీన్ని ట్విట్టర్లో పోస్టు చేసిన వ్యక్తులు.. ‘కోడిపిల్లలను దొంగిలించే వారెవరో కనిపెట్టడం కోసం పెట్టిన ఉచ్చులో ఇలా ఇరుక్కున్నారు’ అంటూ క్యాప్షన్ పెట్టారు.

అంటే అక్కడ పాము కోడిపిల్లల దొంగతనం చేస్తుందన్నమాట. ఓ బురదలో పాక్కుంటూ వచ్చిన పాముకు ఓ బ్లూ డ్రమ్.. దాని అవతలి వైపు కోడి పిల్లలు కనిపించాయి. అమాంతం వాటిని మింగేయాలని బ్లూ డ్రమ్ లో తలపెట్టింది. వెంటనే అలా ఇరుక్కుపోయింది. నిజానికి ఇది రెండేళ్ల క్రితం పోస్టు చేసినప్పటికీ.. రీసెంట్ గా ట్రెండింగ్ అయి మిలియన్ రెట్ల మంది చూసేందుకు కారణమైంది.



ఇంత వైరల్ అయ్యేసరికి దీనిపై స్కూప్స్ అనే వెబ్ సైట్ ఆరా తీయడం మొదలుపెట్టింది. నిజమైన పాము కంటే ఆ వీడియోలో పెద్ద పాము కనిపిస్తున్నట్లు తేల్చేసింది. వీడియోలో అనకొండ సైజులో కనిపిస్తున్న పాము నిజానికి 3అంగుళాల పైపులో ఇరుక్కుపోయిన పాము అని ఒరిజినల్ క్లిప్ ద్వారా తెలుస్తుంది.

ఇలా పాము వీడియోలతో బురిడీ కొట్టించడం తొలిసారేం కాదు. అలాంటి పామును 50అడుగుల పొడవున్న పాములా ప్లాన్ చేస్తున్నారు.