Donald Trump: ఐ లవ్ పాకిస్తాన్, భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా- మరోసారి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఐ లవ్ పాకిస్తాన్ అని అనడమే కాకుండా.. పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ను ట్రంప్ ప్రశంసించడం విమర్శలకు తావిచ్చింది.

Donald Trump: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ లో అమెరికా జోక్యం లేదన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు. భారత్, పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి చెప్పారు. అంతేకాదు.. ఐ లవ్ పాకిస్తాన్ అంటూ కామెంట్ చేశారు. మోదీ గొప్ప వ్యక్తి అన్నారు. యుద్ధాన్ని ఆపడంలో పాకిస్తాన్ నుంచి ఆర్మీ చీఫ్ మునీర్, భారత్ నుంచి ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారని తెలిపారు.
భారత్ పాక్.. ఈ రెండూ అణ్వయుధాలు కలిగిన దేశాలు కావడంతో యుద్ధాన్ని ఆపానని చెప్పుకొచ్చారు ట్రంప్. గత రాత్రి మోదీతో వాణిజ్య ఒప్పందంపై చర్చించినట్లు తెలిపారు ట్రంప్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ తో భేటీ సందర్భంగా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు డిస్కషన్ కు దారితీశాయి.
ఐ లవ్ పాకిస్తాన్ అని అనడమే కాకుండా.. పహల్గామ్ ఉగ్రవాద దాడి సూత్రధారి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ను ట్రంప్ ప్రశంసించడం విమర్శలకు తావిచ్చింది. ట్రంప్ తీరుపై భారతీయులు ఆగ్రహంగా ఉన్నారు. భారత్ కు శత్రువు అని తెలిసి కూడా.. ట్రంప్ పాకిస్తాన్ కు ప్రాముఖ్యత ఇవ్వటం, ఆ దేశంతో సన్నిహితంగా మెలగటం భారతీయులకు తీవ్రమైన కోపం తెప్పిస్తోంది.
భారత ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడిన కొన్ని గంటల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి అదే వాదన అందుకున్నారు. భారత్-పాక్ యుద్ధాన్ని నేనే ఆపా అంటూ తన వాదనను పునరావృతం చేశారు. ప్రధాని మోదీని “అద్భుతమైన వ్యక్తి” అని అభివర్ణించిన ట్రంప్.. రెండు దేశాలు వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయని తెలిపారు.
“నేను యుద్ధాన్ని ఆపాను. నేను పాకిస్తాన్‌ను ప్రేమిస్తున్నా. మోదీ అద్భుతమైన వ్యక్తి అని నేను అనుకుంటున్నా. నిన్న రాత్రి నేను ఆయనతో మాట్లాడాను. భారత్ తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నాము. రెండు ప్రధాన అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధాన్ని నేనే ఆపా” అని ట్రంప్ బుధవారం అన్నారు. బుధవారం వైట్ హౌస్‌లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు లంచ్ ఇచ్చారు ట్రంప్.
Also Read: ఇజ్రాయెల్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా.. ఇరాన్ లో అంతర్యుద్ధం? సుప్రీం లీడర్ పై ప్రజల్లో వ్యతిరేక గళం…
మంగళవారం ట్రంప్‌తో దాదాపు 35 నిమిషాల పాటు జరిగిన ఫోన్ సంభాషణలో, భారత్ మధ్యవర్తిత్వాన్ని “ఎప్పటికీ అంగీకరించదు” అని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. అంతేకాదు కాల్పుల విరమణ ఒప్పందం.. భారత-పాకిస్తాన్ సైన్యాల మధ్య చర్చలు, ఇస్లామాబాద్ అభ్యర్థన మేరకు జరిగిందని ప్రధాని మోదీ ట్రంప్ కు తెలిపారని మిస్రీ వెల్లడిచారు. భారత్ ఇలా చెబుతున్నా.. ట్రంప్ మాత్రం యుద్ధాన్ని నేనే ఆపా అని పదే పదే చెప్పుకుంటున్నారు.