India Pakistan War: భారత్-పాకిస్తాన్ యుద్దం ఆపింది నేనే..! మరోసారి గొప్పలకు పోయిన ట్రంప్.. ఇంకా ..

తన మధ్యవర్తిత్వంతో ఎన్నో దేశాల మధ్య శాంతి నెలకొందని చెప్పారు. ఆ క్రెడిట్ మాత్రం తాను ఎప్పుడూ తీసుకోలేదని ట్రంప్ చెప్పారు.

India Pakistan War: భారత్-పాకిస్తాన్ యుద్దం ఆపింది నేనే..! మరోసారి గొప్పలకు పోయిన ట్రంప్.. ఇంకా ..

Donald Trump

Updated On : June 16, 2025 / 12:26 AM IST

India Pakistan War: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాను కోతల రాయుడిని అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. గొప్పలు చెప్పుకోవడంలో గుక్క తిప్పుకోనని రుజువు చేశారు. తాను చేయని పనిని, తనకు సంబంధం లేని కార్యాన్ని కూడా తానే చేసినట్లు, ప్రపంచ శాంతికి తానే దూతనైనట్లు ఏమాత్రం మొహమాటం లేకుండా ప్రకటించుకున్నారు. తన ప్రమేయమే లేని పనిని తన గొప్పలుగా గప్పాలు కొట్టుకున్నారు. ఇజ్రాయల్, ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో ఆ రెండు దేశాలు ఓ ఒప్పందానికి రావాల్సిన అవసరం ఉందని ట్రంప్ చెప్పారు.

ఆ దిశగా తాము ప్రయత్నిస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. అదే సమయంలో తన గొప్పల గురించి డంకా బజాయించారు. తన మధ్యవర్తిత్వంతో ఎన్నో దేశాల మధ్య శాంతి నెలకొందని చెప్పారు. ఆ క్రెడిట్ మాత్రం తాను ఎప్పుడూ తీసుకోలేదని ట్రంప్ చెప్పారు. కేవలం తన వల్లే నెల రోజుల క్రితం భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందని మరోసారి గొప్పులు చెప్పుకున్నారు ట్రంప్.

అయితే ట్రంప్ కామెంట్స్ ను భారత్ గతంలోనే కొట్టిపారేసింది. అయినా ట్రంప్ మాత్రం గొప్పలకు పోతున్నారు. మరోసారి అదే వ్యాఖ్యలు చేశారు. ఆత్మరక్షణ కోసమే ఇజ్రాయల్ పై దాడులు చేశామని, ఆ దేశం సైనిక చర్యను నిలిపివేస్తే తాము కూడా ప్రతిదాడులు ఆపేస్తామని ఇరాన్ ప్రకటించిన కాసేపటికే ట్రంప్ ఈ ప్రకటన చేశారు.

Also Read: అధిక లాభాల పేరుతో సోదరుల ఘరానా మోసం.. 70వేల మంది నుంచి 2వేల 700 కోట్లు వసూలు..

అందుకు కాసేపటి ముందే ఇరాన్ ను హెచ్చరిస్తూ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయల్ దాడులతో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అయినా లెక్క చేయకుండా అమెరికాపై దాడికి తెగబడితే కనీవిని ఎరుగని రీతిలో టెహ్రాన్ పై విరుచుకుపడతామని హెచ్చరించారు. అంతలోనే ఆ రెండు దేశాల మధ్య సంధి చేస్తామని మరోసారి గొప్పులు చెప్పుకున్నారు ట్రంప్.

తాను తొలిసారి అధ్యక్షుడిగా పని చేసిన సందర్భంలో సెర్బియా, కొసావో, ఈజిప్ట్, ఈథియోపియా మధ్య వివాదాలు పరిష్కరించుకున్నట్లు చెప్పుకొచ్చారు ట్రంప్. అలాగే ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయల్ మధ్య కూడా త్వరలోనే శాంతి ఒప్పందం ఏర్పడుతుందన్నారు. ఇప్పటికే చాలా సమావేశాలు నిర్వహించామని, పలువురితో సంప్రదింపులు జరిపామని రాసుకొచ్చారు ట్రంప్.