కరోనా యాంటీబాడీల ఇమ్యూనిటీ 7 నెలల వరకు ఉండొచ్చు.. కొత్త అధ్యయనం

Immunity from COVID-19 : కరోనా నుంచి కోలుకున్నవారిలో SARS-CoV-2 antibodies ఏడు నెలల వరకు ఉండొచ్చునని కొత్త అధ్యయనం వెల్లడించింది.
Arizona University నిర్వహించిన ఈ అధ్యయనంలో SARS-CoV-2 infection నుంచి కోలుకున్నాక హై క్వాలిటీ యాంటీబాడీలు తయారవుతాయని.. ఐదు నెలల నుంచి ఏడు నెలల వరకు శరీరంలోనే ఉంటాయని తేల్చేశారు పరిశోధకులు.
Covid-19 నుంచి ఇమ్యూనిటీ ఎంతకాలం ఉంటుందో అర్థం చేసుకునేందుకు సైంటిస్టులు 6,000 మందితో ఒక అధ్యయనాన్ని నిర్వహించారు. కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారికి మళ్లీ వైరస్ సోకకుండా ఉండేందుకు వారిలో ఇమ్యూనిటీ ఎంతకాలం రక్షిస్తుందనే దానిపై ప్రధానంగా అధ్యయనం చేశారు. దాదాపు 6వేల మందిలో కరోనా యాంటీబాడీల ఉత్పత్తి ఎలా ఉందో కనుగొనేందుకు శాంపిల్స్ సేకరించారు.
ఒకసారి కరోనా వైరస్ నుంచి కోలుకున్నాక కనీసంగా ఏడు నెలల పాటు కరోనా యాంటీబాడీలు శరీరంలోనే ఉంటాయని అధ్యయనంలో పరిశోధకులు తేల్చేశారు.
SARS-CoV-2 infection తర్వాత చాలామందిలో ఐదు నెలల నుంచి ఏడు నెలల వరకు యాంటీబాడీలు అత్యధిక స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయని స్పష్టంగా చూశామని University of Arizona College of Medicine-Tucson ఇమ్యూనాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ దీప్తా భట్టాచార్య తెలిపారు.
SARS-CoV-2 యాంటీబాడీస్ ప్రొటెక్షన్ :
వైరస్ మొదట కణాలకు సోకినప్పుడు.. రోగనిరోధక వ్యవస్థ స్వల్పకాలిక ప్లాస్మా కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది వైరస్‌తో పోరాడటానికి యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. ఆ యాంటీబాడీలు సంక్రమణ జరిగిన 14 రోజుల్లో రక్త పరీక్షలలో కనిపిస్తాయి.
రోగనిరోధక ప్రతిస్పందన రెండవ దశ దీర్ఘకాలిక ప్లాస్మా కణాలను సృష్టిస్తాయి. శాశ్వత రోగనిరోధక శక్తిని అందించే అధిక-నాణ్యత యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. SARS-CoV-2 యాంటీబాడీలు రక్త పరీక్షలలో కనీసం ఐదు నుండి ఏడు నెలల వరకు ఉన్నాయని కనుగొన్నారు.