Sri Lanka : శ్రీలంక నూతన అధ్యక్షుడెవరు?

ఒకవేళ రణిల్‌ అధ్యక్షుడిగా గెలిస్తే.. ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక... విపక్ష నేత సాజిద్​ ప్రేమదాస కూడా రేసులో ఉన్నారు. కానీ అధ్యక్షుడిగా ఆయన సొంతంగా గెలవలేరు. అందుకు కావాల్సిన బలం పార్లమెంట్​లో ఆయనకు లేదు. మాజీ జర్నలిస్ట్, SLPP సీనియర్ లీడర్ అయిన డల్లాస్ అలహప్పెరుమ పేరు కూడా వినిపిస్తోంది.

Sri Lanka : శ్రీలంక నూతన అధ్యక్షుడెవరు?

Sri Lanka 11zon

Updated On : July 16, 2022 / 2:31 PM IST

Sri Lanka crisis : శ్రీలంక సంక్షోభం నేపథ్యంలో నూతన అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపడతారన్న విషయంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరో 7రోజుల్లో కొత్త అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తికానుండగా.. ఇవాళ సమావేశం కానున్న పార్లమెంట్‌.. ఆ ప్రక్రియను ప్రారంభించనుంది. ప్రస్తుతం రేసులో ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రధానమంత్రిగా, తాత్కాలిక అధ్యక్షుడిగా ఉన్న రణిల్ విక్రమసింఘేతోపాటు మరో ఇద్దరు రేసులో ఉన్నారు. అధికార పక్షం SLPPతో పాటు గొటబాయ సోదరుడి మద్దతు కూడా రణిల్‌కే ఉందని సమాచారం.

ఒకవేళ రణిల్‌ అధ్యక్షుడిగా గెలిస్తే.. ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇక… విపక్ష నేత సాజిద్​ ప్రేమదాస కూడా రేసులో ఉన్నారు. కానీ అధ్యక్షుడిగా ఆయన సొంతంగా గెలవలేరు. అందుకు కావాల్సిన బలం పార్లమెంట్​లో ఆయనకు లేదు. మాజీ జర్నలిస్ట్, SLPP సీనియర్ లీడర్ అయిన డల్లాస్ అలహప్పెరుమ పేరు కూడా వినిపిస్తోంది. ఆయనకు ఓ వర్గం నుంచి భారీ మద్దతు కూడా ఉంది.

Parliament Monsoon Session: పార్లమెంట్ ముందుకు 24 బిల్లులు.. ఎల్లుండి నుంచి సమావేశాలు ప్రారంభం

ఇక లంక మాజీ అధ్యక్షుడు గొటబయ రాజపక్స సోదరులు, మాజీ ప్రధాన మంత్రి మహింద రాజపక్స, మాజీ మంత్రి బసిల్ రాజపక్స దేశం విడిచి వెళ్ళరాదని శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది. గొటబయ విదేశాలకు వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆయన సోదరులిద్దరూ జూలై 28 వరకు దేశం విడిచి వెళ్ళకూడదని ఆదేశించింది. మహింద, బసిల్‌లపై ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ శ్రీలంక, మరో ముగ్గురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది.