భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్

  • Published By: veegamteam ,Published On : November 23, 2019 / 11:55 AM IST
భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్

Updated On : November 23, 2019 / 11:55 AM IST

బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్టు, రెండో రోజు ఆటలో భారత్ ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసింది. టీమిండియా 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. 347/9 దగ్గర ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ప్రత్యర్థిపై 241 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి రోజు ఆటలో 106పరుగులకే బంగ్లాను ఆలౌట్ చేసిన టీమిండియా.. 174/3ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు ఆట మొదలుపెట్టింది. క్రమంగా ఆధిక్యాన్ని పెంచుతూ దూసుకెళ్తున్నారు. సెంచరీకి మించిన స్కోరుతో పలు రికార్డులు నమోదు చేసిన కోహ్లీ.. 194బంతుల్లో 136పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

కోహ్లీ అవుట్ అయ్యే సమయానికి 203పరుగుల భారత్ ఆధిక్యంలో ఉన్నది. 308పరుగుల వద్ద కోహ్లీ అవుట్ అవడంతో క్రీజులో వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్ నిలిచారు. కోహ్లీతో పాటు పూజారా(55), రహానె(51)లు హాఫ్ సెంచరీకి మించిన స్కోరుతో రాణించారు. ఇబాదత్ హుస్సేన్ 3వికెట్లు పడగొట్టగా, అల్ అమీన్ హుస్సేన్, అబూ జాయెద్, తైజుల్ ఇస్లాం తలో వికెట్ తీయగలిగారు.