55 కరోనా బాధిత దేశాలకు భారత్ ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ డ్రగ్ సరఫరా

కరోనా వైరస్ ప్రభావిత దేశాలకు భారతదేశం యాంటీ మలేరియా డ్రగ్ ‘హైడ్రాక్సీ క్లోరోక్విన్’ను సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా 55 దేశాలకు HCQ మందును సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. వాణిజ్య ప్రాతిపదికన మలేరియా నిరోధక మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను సరఫరా చేసే పనిలో భారత్ ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. యుఎస్, మారిషస్, సీషెల్స్ సహా అనేక దేశాలు గత కొద్ది రోజులలో ఇప్పటికే HCQ ఔషధాన్ని అందుకున్నాయి. మరికొన్నిదేశాలు వారాంతంలో మలేరియా నిరోధక ఔషధాన్ని అందుకుంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
COVID-19కు సాధ్యమైన చికిత్సగా హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించింది. ఈ ఔషధంతో న్యూయార్క్‌లోని 1,500 మందికి పైగా కరోనావైరస్ రోగులపై పరీక్షిస్తున్నారు. విదేశాలకు డ్రగ్స్ ఎగుమతిపై నిషేధాన్ని ఎత్తివేయాలని భారత్ నిర్ణయించిన తరువాత గత కొద్ది రోజులుగా ఔషధ డిమాండ్ వేగంగా పెరిగింది.
భారతదేశం ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్ నేపాల్, మాల్దీవులు, మారిషస్, శ్రీలంక, మయన్మార్లకు ఈ ఔషధాన్ని పంపుతున్నట్లు వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ ఈ ఔషధాన్ని సరఫరా చేయాలని కోరిందో లేదో కచ్చితమైన సమాచారం లేదు. జాంబియా, డొమినికన్ రిపబ్లిక్, మడగాస్కర్, ఉగాండా, బుర్కినా ఫాసో, నైజర్, మాలి కాంగో, ఈజిప్ట్, అర్మేనియా, కజాఖ్స్తాన్, ఈక్వెడార్, జమైకా, సిరియా, ఉక్రెయిన్, చాడ్, జింబాబ్వే, ఫ్రాన్స్, జోర్డాన్, కెన్యా, నెదర్లాండ్స్ , ఒమన్, పెరూలో HCQ ఔషధాన్ని సరఫరా చేస్తున్నట్టు వర్గాలు తెలిపాయి.
దీనిని ఫిలిప్పీన్స్, రష్యా, స్లోవేనియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, టాంజానియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఉజ్బెకిస్తాన్, ఉరుగ్వే, కొలంబియా, అల్జీరియా బహామాస్, మారిషస్, యునైటెడ్ కింగ్‌డమ్‌కు సరఫరా వర్గాలు తెలిపాయి. ఈ ఔషధాన్ని వాణిజ్య ప్రాతిపదికన అనేక దేశాలకు పంపుతున్నామని, మరికొందరు దీనిని భారతదేశం గ్రాంట్లుగా పొందుతున్నారని ఆ వర్గాలు తెలిపాయి.
ఇటీవల టెలిఫోనిక్ సంభాషణలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడారు. అమెరికాలో పెరుగుతున్న కరోనా వైరస్ రోగులకు చికిత్స చేసేందుకు అవసరమైన హైడ్రాక్సీక్లోరోక్విన్ టాబ్లెట్ల అమ్మకాన్ని అనుమతించాలని ప్రధాని నరేంద్ర మోడిని ట్రంప్ అభ్యర్థించారు.
విదేశాలకు డ్రగ్స్ ఎగుమతిపై నిషేధం విధించిన దాదాపు రెండు వారాల తరువాత భారత్ గత వారమే ఎత్తివేసింది. అమెరికాకు మందులు సరఫరా చేయకపోతే ప్రతీకార చర్య తీసుకుంటామని ట్రంప్ భారతదేశాన్ని హెచ్చరించిన కొన్ని గంటల తర్వాత నిషేధాన్ని ఎత్తివేసే ప్రకటన వచ్చింది. ట్రంప్ వ్యాఖ్యలకు ముందే నిషేధం ఎత్తివేసినట్లు భారత అధికారులు పేర్కొన్నారు.