అప్పుడూ అదే : ఇవాంక ట్రంప్ ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలుసా!

  • Published By: madhu ,Published On : February 24, 2020 / 09:16 AM IST
అప్పుడూ అదే : ఇవాంక ట్రంప్ ధరించిన డ్రెస్ ధర ఎంతో తెలుసా!

Updated On : February 24, 2020 / 9:16 AM IST

భారత్‌కు వచ్చిన అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూతురు..ఇవాంక ట్రంప్ ధరించిన డ్రస్‌పై సోషల్ మీడియాలో తెగ చర్చ జరుగుతోంది. ఆమె ధరించిన డ్రెస్ ఖరీదు ఎంత ? ఈ డ్రస్ ఇప్పటికే ఎక్కడో వేసుకున్నారు కదా..అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 2020, ఫిబ్రవరి 24వ తేదీ సోమవారం ఉదయం 11.45 గంటలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుటుంబసమేతంగా అహ్మాదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అడుగు పెట్టారు.

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వారికి ఘన స్వాగతం పలికారు. ఇవాంక ట్రప్ డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎరుపు, తెలుపు రంగులో ఉన్న మిడీ డ్రెస్‌ను ఆమె ధరించారు. మాములుగానే..ఆమె ఎత్తుగా ఉంటుంది. అందులో పొడవైన ఎర్రటి హై హీల్స్ ధరించి..మరింత ఎత్తుగా కనిపించారు. డ్రెస్‌కు పెట్టిన ఖర్చు గురించి వార్తలు వెలువడుతున్నాయి. ఆమెకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. 

See Also>>మోతేరా స్టేడియం: మీకు తెలియని 10విషయాలు ఇవే!

ఇవాంక ధరించిన డ్రెస్ భారత కరెన్సీలో రూ. 1.7 లక్షలే. గతంలో 2019లో అర్జెంటీనా వెళ్లినప్పుడు చివరిసారిగా ఆమె ఈ డ్రెస్ ధరించారు. స్టన్నింగ్ ఔట్ ఫిట్‌తో వచ్చిన ఇవాంక స్టేడియంలో సెల్ఫీలు దిగుతూ..సందడిగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇవాంకా ఇండియాకు రావడం ఇది రెండోసారి. రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఓ సమావేశంలో ఈమె పాల్గొన్నారు. 

Read More>>Wow నమస్తే ట్రంప్ : ఆశ్చర్యపోయిన ట్రంప్ సహాయకుడు