Indian Aircraft : పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించిన భారత విమానం.. ప్రతికూల వాతావరణం కారణంగా..

పాకిస్తాన్ పౌర విమానయాన అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించిన ఇండిగో విమాన సిబ్బందిని వారు కాంటాక్ట్ చేశారు. తిరిగి వెళ్లేందుకు గైడ్ చేశారు.

Indian Aircraft : పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించిన భారత విమానం.. ప్రతికూల వాతావరణం కారణంగా..

Indian aircraft

Updated On : June 12, 2023 / 9:30 AM IST

Pakistani Airspace : ప్రతికూల వాతావరణం కారణంగా భారత విమానం పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించింది. ఇండిగో విమానం సుమారు అరగంట పాటు పాకిస్తాన్ గగనతలంలో ఎగిరింది. ఆ తర్వాత సురక్షితంగా తిరిగి వచ్చింది. శనివారం ఈ సంఘటన జరిగినట్లు ఆ సంస్థ పేర్కొంది. ఇండిగో ఎయిర్ లైన్ కు చెందిన 6ఈ-645 విమానం శనివారం సాయంత్రం పంజాబ్ లోని అమృత్ సర్ నుంచి గుజరాత్ లోని అహ్మదాబాద్ కు బయలుదేరింది.

అయితే వాతావరణం సరిగా లేకపోవడంతో ఇండిగో విమానం దారి మళ్లింది. పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించింది. సరిహద్దు నుంచి వంద కిలోమీటర్ల దూరం పైగా ఉన్న గుజ్రాన్ వాలా వరకు సుమారు అరగంట పాటు పాకిస్తాన్ గగనతలంలో ఎగిరింది. ఈ విషయాన్ని గ్రహించిన వెంటనే అమృత్ సర్ లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిబ్బంది అలెర్ట్ అయ్యారు.

Houston Club Firing: అమెరికాలో మరోసారి కాల్పులమోత.. హ్యూస్టన్‌ నగరంలో ఘటన

పాకిస్తాన్ పౌర విమానయాన అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ గగనతలంలోకి ప్రవేశించిన ఇండిగో విమాన సిబ్బందిని వారు కాంటాక్ట్ చేశారు. తిరిగి వెళ్లేందుకు గైడ్ చేశారు. దీంతో ఆ ఇండిగో విమానం భారత్ గగనతలంలోకి తిరిగి వచ్చింది. అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఈ సంఘటనపై పాకిస్తాన్ పౌర విమానయాన అథారిటీ అధికారులు స్పందించారు.

454 నాట్ల వేగంతో ప్రయాణించిన ఇండిగో విమానం శనివారం రాత్రి 7:30 గంటలకు లాహోర్ కు ఉత్తరాన తమ గగనతలంలోకి ప్రవేశించినట్లు పేర్కొన్నారు. ఆ విమానాన్ని గైడ్ చేయడంతో రాత్రి 8:01 గంటలకు తిరిగి భారత్ గగనతలంలోకి వెళ్లిందని చెప్పారు. అయితే ఇది అసాధారణ సంఘటన కాదని అన్నారు. వాతావరణం అనుకూలించని పరిస్థితుల్లో విమానం దారి మళ్లేందుకు అంతర్జాతీయం అనుమతి ఉంటుందని వెల్లడించారు.

Earthquake : జపాన్ లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.6గా నమోదు

మరోవైపు మే 4న ఒమన్ రాజధాని మస్కట్ నుంచి లాహోర్ కు వెళ్తున్న పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్ లైన్స్ (పీఐఏ) కు చెందిన విమానం భారత్ గగనతలంలోకి ప్రవేశించింది. సుమారు 10 నిమిషాల పాటు ఎగిరిన తర్వాత తిరిగి వెళ్లింది. పాకిస్థాన్ లో బాగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో లాహోర్ లో విమానం ల్యాండింగ్ కు ఫైలట్లు బాగా ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలో పాక్ విమానం భారత్ గగనతలంలోకి ప్రవేశించినట్లు తెలిసింది.