Canada PM trolled” “కర్మ అనుభవించక తప్పదు” కెనడా ప్రధానిపై భారతీయుల ట్రోలింగ్

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సహా.. ఇతర భారతీయ ప్రముఖులు సైతం పీఎం జస్టిన్ ట్రూడోపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. భారత నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.

Canada PM trolled” “కర్మ అనుభవించక తప్పదు” కెనడా ప్రధానిపై భారతీయుల ట్రోలింగ్

Trudeau

Updated On : January 31, 2022 / 8:39 PM IST

Canada PM trolled” కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడోపై భారత నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సహా.. ఇతర భారతీయ ప్రముఖులు సైతం పీఎం జస్టిన్ ట్రూడోపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. కెనడా దేశంలో ప్రజలకు కరోనా వాక్సిన్ తప్పనిసరి చేయడంపై అక్కడి ప్రజల్లో ఆగ్రహావేశాలు రగిల్చాయి. అమెరికా – కెనడా దేశాల మధ్య తిరుగాడే లారీ డ్రైవర్లను వాక్సిన్ ఉంటేనే అనుమతిస్తామంటూ.. దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ప్రకటనలు డ్రైవర్లలో అసహనాన్ని పెంచాయి. దీంతో జనవరి 29న వేలాది మంది డ్రైవర్లు దేశ రాజధాని ఒట్టావాలో నిరసనకు దిగారు. ప్రధాని అధికారిక నివాసాన్ని ముట్టడించి ఆందోళన చేపట్టారు. లారీ డ్రైవర్లకు మద్దతు తెలుపుతూ ప్రజలు సైతం ప్రధాని ట్రూడోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Also read: TATA Nexon EV: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా సరికొత్త రికార్డు

అయితే ఈ నిరసనలు మరింత ఉద్రేకం చెంది ఘర్షణలకు దారి తీస్తాయని నిఘావర్గాలు హెచ్చరించాయి. దీంతో ప్రధాని ట్రూడో.. భార్య పిల్లలతో సహా.. రహస్య ప్రాంతానికి తరలి వెళ్లిపోయారు. ఇప్పటికి ఆయన ఎక్కడున్నారనే విషయం తెలియరాలేదు. ఇక ఈ ఘటనపై భారత నెటిజన్లు స్పందిస్తూ.. కెనడా ప్రధాని ట్రూడోని.. సోషల్ మీడియాలో ఆటాడుకున్నారు. ఇప్పుడు కర్మ అంటే ఏంటో తెలిసిందా అంటూ ట్రూడో పై తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. మనకంటూ ఒకరోజు వస్తుంది.. ఆరోజు కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదంటూ భారతీయ నెటిజన్లు.. కెనడా ప్రధాని ట్రూడోను తెగ ట్రోల్ చేస్తున్నారు.

Also read: BJP OBC Morcha: వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ తాపత్రయం: కే. లక్ష్మణ్

అసలు విషయానికొస్తే..భారత్ లో బీజేపీ ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ.. రైతు సంఘాలు ఢిల్లీలో నిరసనకు దిగిన సంగతి విదితమే. చట్టాలను వెనక్కు తీసుకోవాలంటూ రైతు సంఘాలు ఢిల్లీలో తిష్టవేసుకుని..బీజేపీ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. ఆసమయంలో దేశవిదేశాల్లో ఉన్న కొందరు వ్యక్తులు రైతులకు మద్దతు తెలిపారు. ఈక్రమంలో జస్టిన్ ట్రూడో కూడా రైతులకు అనుకూలంగా ట్వీట్ చేశారు. అయితే తమ దేశ అంతర్గత పరిస్థితుల గురించి తమకేం తెలుసంటూ అప్పట్లోనే ట్రూడో పై భారతీయులు మండిపడ్డారు. అదే కాకుండా భారత్ ఖండించిన సిక్కు ఉద్యమానికి, సిక్కు నేతలకు ట్రూడో వత్తాసు పలికారు. దీంతో భారతీయుల్లో తనకున్న మంచి అభిప్రాయం సైతం ట్రూడో కోల్పోయారు. ఇప్పుడు తనదాకా వచ్చేదాకా పరిస్థితులు ఎలా ఉంటాయో ట్రూడోకి అర్ధమై ఉంటుందని సోషల్ మీడియా వేదికగా భారతీయులు కామెంట్స్ చేస్తున్నారు.

Also read: Pregnant Woman: గర్భిణీకి సురక్షితమైన ఆశ్రయం కల్పించిన తాలిబన్లు